Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్

ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .

Mudragada vs Pawan: ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ . దీంతో పవన్ వర్సెస్ ముద్రగడ లా సాగుతున్నాయి అక్కడ రాజకీయాలు. అయితే పవన్ ముద్రగడ పేరుని ప్రస్తావించకుండా పలు సభలలో ప్రసంగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముద్రగడ స్పందిస్తూ సవాల్ విరారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే పరోక్షంగా కాకుండా నేరుగా తన గురించి మాట్లాడాలని సవాల్‌ విసిరారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పుట్టి ఇతర రాష్ట్రానికి చెందిన పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడమేంటని ప్రశ్నించారు. కళ్యాణ్ పౌరుషానికి సవాల్ విసిరిన పద్మనాభం.. హైదరాబాద్ లో తనకు అవమానం జరిగినప్పుడు అదే కోపం, భావోద్వేగం ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. తనను అవమానించిన వారితో దోస్తీ మెయింటైన్ చేయడాన్ని తప్పుబట్టాడు.

We’re now on WhatsAppClick to Join

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన అనుచరులను ఉసిగొల్పకుండా నేరుగా మాట్లాడాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే సమాధానం చెబుతానని, మళ్లీ ప్రశ్నలు సంధిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు

Also Read: Parigi MLA Ram Mohan Reddy : హరీష్ రావు నీ తాటతీస్తా జాగ్రత్త.. ఆ ఎమ్మెల్యే వార్నింగ్