Site icon HashtagU Telugu

Mudragada : రాష్ట్ర ప్రజలకు ముద్రగడ చిన్న మనవి..

Mudragada Padmanabham

Mudragada Padmanabham

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)..మొత్తానికి వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం వరకు కూడా జగన్ (Jagan) పార్టీ లో చేరేది లేదని , టిడిపి (TDP) , లేదా జనసేన (Janasena) పార్టీలలో చేరుతా..లేదంటే సైలెంట్ గా ఉండిపోతే అంటూ చెప్పుకొచ్చిన పెద్దాయన..ఇప్పుడు మాత్రం జగన్ ను మరోసారి సీఎం చేస్తా..ప్రజలకోసం సంక్షేమ పథకాలు తెప్పిస్తా అంటూ వైసీపీ లో చేరబోతున్నాడు. ఈ నెల 14 న తాను వైసీపీ లో చేరబోతున్నట్లు..దీనికి ప్రజల సహకారం కావాలంటూ ఓ లేఖ (Letter)ను సోమవారం విడుదల చేసారు.

ముద్రగడ రాసిన లేఖ (Mudragada Padmanabham Letter) చూస్తే..

గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి గారు పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పధకాలతోపాటు, వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా.

We’re now on WhatsApp. Click to Join.

తేది 14-03-2024న వై.యస్.ఆర్.సి.పి లోకి చేరుటకు ఉదయం 8-00 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్ధిస్తున్నానండి. చిన్న మనవి, క్షమించండి ఈ ప్రయాణంలో మీ, మీ కావలసిన |ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి అంటూ లేఖ రాసారు.

చివర్లో చిన్న మనవి అంటూ ఓ నోట్ రాసుకొచ్చారు. ఈ ప్రయాణంలో మీ, మీ కావలసిన |ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి. అని రూటు మేప్ ను రాసారు. కిర్లంపూడి –> ప్రత్తిపాడు –> జగ్గంపేట లాలా చెరువు — వేమగిరి –> రావులపాలెం — తణుకు –> తాడేపల్లిగూడెం –> ఏలూరు –> విజయవాడ— తాడేపల్లి.” అంటూ ప్రజలనుద్దేశించి ఆయన లేఖను విడుదల చేశారు.

Mudragada Letter

Read Also : CM Revanth Visit Yadadri : యాదాద్రి ల‌క్ష్మీనర‌సింహ‌స్వామి సేవ‌లో సీఎం రేవంత్ దంప‌తులు

Exit mobile version