Mudragada : చంద్రబాబు పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు?: ముద్రగడ

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 04:21 PM IST

Mudragada Padmanabham : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై వైసీపీ(YCP) నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కల్యాణ్ క్లబ్ లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు? మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ అన్నారు. తెరవెనుక ఉండి మాట్లాడించడం మగతనం కాదు.. దమ్ము ధైర్యం ఉంటే నేరుగా నా గురించి ప్రశ్నించండి. క్లబ్బులు నడిపే వారితో 5, 10 రూపాయలు ఎం.వోలు చేసి అవమానించారు. రోజుకో లక్ష చొప్పున నాకు ఎం.వోలు చేయండి.. ప్రజా సేవకోసం ఉపయోగిస్తానని ముద్రగడ అన్నారు. పవన్ కల్యాణ్ కూటమి పొత్తులో భాగంగా తీసుకున్న 20 సీట్లు కూడా త్యాగంచేసి పార్టీ మూసేయడం మంచిది. షూటింగ్ లకు వెళ్లిపోతే త్యాగశీలిగా మిగిలిపోతారు పవన్ అంటూ ముద్రగడ సలహాలు ఇచ్చారు. పవన్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరు, బౌన్సర్లతో అడ్డుకుంటారు. మరెందుకు మీకు ప్రజాసేవ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఎస్టేట్ ను కాపాడేందుకే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్దిచెప్పి ప్యాక్ చేసి పవన్ పార్టీని ఇంటికి పంపేయాలని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు.

Read Also: Happy Life: నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలో అవ్వండి

మరోవైపు పవన్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. తెనాలి పర్యటనతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ పర్యటించాల్సి ఉంది. 7, 8వ తేదీ వరకు పర్యటించాల్సి ఉంది. జ్వరం తీవ్ర కావడంతో పవన్ పర్యటనను రీషెడ్యూల్ చేయడానికి జనసేన సమాయత్తం అవుతోంది. రెండు మూడు రోజుల పాటు కచ్చితంగా పవన్ కల్యాణ్ కు విశ్రాంతి అవసరం అని చెబుతున్నారు. మొత్తంగా అనారోగ్యం కారణంగా రెండు మూడు రోజుల పాటు పవన్ పర్యటనను ఆపేయాల్సి వచ్చింది.