Site icon HashtagU Telugu

జనసేన లేదంటే టీడీపీ లోకి వెళ్తా – ముద్రగడ క్లారిటీ

Mudragada

Mudragada

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం దారెటు అని గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా ఈయనతో పాటు ఈయన కొడుకు ఇద్దరు వైసీపీ లోకి వెళ్లడం ఖాయమని..ఎన్నికల సమయానికి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఆలా అనుకున్నవారందరికి షాక్ ఇచ్చారు. టీడీపీ లేదా జనసేన ఈ రెండు పార్టీలల్లోనే చేరతారనని..కుదరకపోతే ఇంట్లోనే కూర్చుంటా అని క్లారిటీ ఇచ్చారు. అంతే కానీ వైసీపీ లో ఎట్టి పరిస్థితుల్లో చేరేది లేదని..మా ఇంటికి వచ్చి మీరు సమయం వృథా చేసుకోవద్దని.. మీ పని మీరు చూసుకోండంటూ వైసీపీ నేతలకు తెలిపాడు ముద్రగడ.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే ముద్రగడతో టీడీపీ, జనసేన నేతలు వరుసగా భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన జనసేన పార్టీలోకి చేరుతారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలోనే ముద్రగడ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవనున్నట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ.. టీడీపీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఏ పార్టీ లో చేరేది పూర్తిగా తెలియనుంది.

ఇదిలా ఉంటె జనసేనలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వైసీపీ నుండి పెద్ద నేతల దగ్గరి నుండి చిన్న నేతల వరకు ఇలా అంత చేరుతూనే ఉన్నారు. తాజాగా విశాఖ జిల్లా కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పెందుర్తి నియోజవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ కంచిపాటి విశ్వనాథ్ నాయుడు జనసేనలో చేరారు. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్‌ను పవన్ కల్యాణ్ సాదరణంగా జనసేనలోకి ఆహ్వానించారు. విశాఖ జిల్లాలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కాశీ విశ్వనాథ్‌కు పవన్ కల్యాణ్ సూచించారు.

Read Also : Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్‌ 24 ప్రీ బుకింగ్స్‌ ఓపెన్.. వారికీ మాత్రమే బంపర్ ఆఫర్?