Site icon HashtagU Telugu

AP : రాబోయే రోజుల్లో ఏపీలో ‘జైలర్’ సినిమా కనిపించబోతుంది – RRR

Daggubati Purandeswari announced new AP BJP state organizational committee

ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari)ఫై వైసీపీ నేతలు (YCP Leaders) చేస్తున్న మాటల దాడి ఫై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghu Rama Krishnam Raju) ఖండించారు. గత కొద్దీ రోజులుగా బీజేపీ, వైసీపీ (BJP vs YCP) మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ చీఫ్ పురందేశ్వరి..జగన్ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో పురందేశ్వరి లక్ష్యంగా వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి కోవర్టుగా, తొత్తుగా పనిచేస్తున్నారని .. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి ఆమె ఏనాడూ మాట్లాడరని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబును బీజేపీతో కలపడమే పురందేశ్వరి లక్ష్యంగా పెట్టుకున్నారని వారు విమర్శలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే పురందేశ్వరి రాసిన బెయిల్ రద్దు లేఖ సైతం రాజకీయ దుమారం రేపుతోంది. ఆమె తీరుపై వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆమె కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇంకొంతమంది మరింత పదజాలంతో మాటలు వదలడం ఫై ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఖండించారు. పురుందేశ్వరిపై తమ పార్టీ నేతలు కారుకూతలు కూస్తున్నారని, ఆ మాటలు వింటుంటే బాధ కలుగుతోందని అన్నారు. ఒక మహిళ, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని… ఇదేనా రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న రక్షణ అని ప్రశ్నించారు. ఒక్క మహిళను అవమానించినా రాష్ట్రంలోని అందరు మహిళలను అవమానించినట్టేనని రఘురామ చెప్పుకొచ్చారు. జగన్ నిజస్వరూపం మోడీ కి తెలిసిపోయిందని… రాబోయే రోజుల్లో ఏపీలో ‘జైలర్’ సినిమా కనిపించబోతోందని పంచ్ డైలాగ్ వేశారు రఘురామ.

Read Also : Whats Today : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేసీఆర్, రేవంత్.. నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ ఢీ