ఏపీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించినా వైసీపీ..ఈసారి 175 కు 175 స్థానాలు సాధించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అధినేత జగన్ పార్టీలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో నేతలంతా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం..పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చడం..ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇస్తామని చెపుతుండడం తో నేతలు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ , జనసేన , కాంగ్రెస్ లలో చేరగా..తాజాగా నర్సరావుపేట (Narsaraopet) పార్లమెంట్ సభ్యులు (Mp) లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Krishnadevarayalu)వైసీపీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి సైతం గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు…తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఈ సారి గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో…పోటీ చేసేందుకు నిరాకరించారు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని…గుంటూరుకు మారేది లేదని తెగేసి చెప్పారు. వైసీపీ నర్సరావుపేట టికెట్ ఇవ్వకపోవడంతో…ఆ పార్టీకి రాజీనామా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన పలువురు పెద్దల్ని కలిసి చర్చించినట్లు ఊహాగానాలు వినిపించాయి.. టీడీపీ లోకి వెళ్లాలని నిర్ణయించుకుని వైసీపీ కి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారనే వాదన వినిపిస్తోంది. అయితే నరసరావుపేటలో అభ్యర్థి కోసం టీడీపీ కసరత్తు చేసింది.. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వస్తే.. ఆయనకు నరసరావుపేట సీటు ఖాయమనే చర్చ జరుగుతోంది. మరి ఆయన ఎలాాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
Read Also : Nara Lokesh Birthday : యువనేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు