పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Sri Krishna Devarayalu)కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయన్ను భారత ఆహార సంస్థ (FCI) ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడికి ఇలాంటి కీలక పదవి లభించడం గర్వకారణమని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Back Pain In Generation Z: వెన్నునొప్పికి అసలు కారణం ఏమిటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
ఎఫ్‌సీఐ కమిటీ ఛైర్మన్ హోదాలో లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, నాణ్యత ప్రమాణాల అమలు వంటి అనేక కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రైతులకు సరైన మద్దతు ధర లభించేందుకు, సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగేందుకు ఆయన చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాలపై నివేదికలు అందిస్తూ, ఆహార భద్రతపై తగిన సిఫార్సులు చేయనున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందిస్తూ.. తనపై నమ్మకం ఉంచిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల సక్రమ నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పారదర్శక పాలనకు తన వంతు సేవ చేస్తానని, తన నియామకం రాష్ట్రానికి మేలు చేయాలనే సంకల్పంతో పని చేస్తానని స్పష్టం చేశారు.