MP Avinash Reddy : మా అమ్మ డిశ్చార్జ్ అయిన త‌ర్వాతే.. సీబీఐకి అవినాష్ రెడ్డి మ‌రో లేఖ‌..

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అవినాష్ రెడ్డిని సీబీఐ ప‌లుసార్లు విచారింది.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 09:36 PM IST

మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హ‌త్య కేసు విష‌యంలో సీబీఐ, క‌డ‌ప(Kadapa) ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అవినాష్ రెడ్డిని సీబీఐ(CBI) ప‌లుసార్లు విచారింది. కి మ‌ధ్య లేఖ‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. హైద‌రాబాద్ సీబీఐ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సీబీఐ అవినాష్ రెడ్డికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విష‌యం విధిత‌మే. కానీ, అవినాష్ రెడ్డి ప‌లు కార‌ణాలు చెబుతూ విచార‌ణ‌కు గైర్హాజ‌ర‌య్యారు. సోమ‌వారం (22న ) ఉద‌యం 11గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సీబీఐ మ‌రోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల‌కుసైతం అవినాష్ రెడ్డి లేఖ‌ద్వారా బ‌దులిచ్చారు. నేను 22న విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న త‌ల్లి శ్రీ‌ల‌క్ష్మీ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని, ఆమె డిశ్చార్జ్ అయ్యేవ‌ర‌కు నేను సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని తెలిపారు. ఇప్ప‌టికే 16, 19 తేదీల్లో విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ప‌లు కార‌ణాలు చెప్పి విచార‌ణ‌కు గైర్హాజ‌రైన అవినాష్ తీరును సీబీఐ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తుంది. తాజాగా మూడోసారి కూడా విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని అవినాష్ సీబీఐకి లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, సీబీఐ అవినాష్ లేఖ‌కు ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అవినాష్ రెడ్డిని సీబీఐ ప‌లుసార్లు విచారింది. ఈ కేసులో అవినాష్ తండ్రితో పాటు మ‌రికొంద‌రిని సీబీఐ అరెస్టు చేసిన విష‌యం తెలిసింది. అవినాష్ రెడ్డినిసైతం సీబీఐ అరెస్టు చేస్తుంద‌ని, విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నేప‌థ్యంలో ఈనెల 16న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ప‌లు కార‌ణాలు చూపుతూ విచార‌ణ‌కు రాలేన‌ని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో సీబీఐ మ‌రోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచార‌ణ‌కు రావాల‌ని ఆ నోటీసుల్లో పేర్కొంది. 19వ తేదీ ఉద‌యం హైద‌రాబాద్ లోని త‌న నివాసం నుంచి అవినాష్ రెడ్డి అనుచ‌రుల‌తో సీబీఐ కార్యాల‌యంకు బ‌య‌లు దేరారు. మార్గం మ‌ధ్య‌లో త‌న త‌ల్లి శ్రీ‌ల‌క్ష్మీని అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేర్పించార‌ని స‌మాచారం రావ‌డంతో నేరుగా క‌డ‌ప వెళ్లారు.

మా అమ్మ ఆరోగ్యం బాగాలేద‌ని, ఆస్ప‌త్రిలో చేర్పించ‌డంతో నేను హుటాహుటీన క‌డ‌ప వెళ్తున్నాన‌ని విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని సీబీఐ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. రెండుసార్లు ప‌లు కార‌ణాల‌తో విచార‌ణ‌కు గైర్హాజ‌రు కావ‌డంతో అవినాష్ తీరును సీబీఐ అధికారులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. దీంతో 22న విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని మ‌రోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే, త‌న త‌ల్లి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్నార‌ని, ఆమె డిశ్చార్జి అయ్యే వ‌ర‌కు విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని సీబీఐకి అవినాష్ లేఖ ద్వారా స‌మాచారం ఇచ్చారు. వ‌రుస‌గా మూడోసారి విచార‌ణ‌కు గైర్హాజ‌రి ప‌ట్ల సీబీఐ ఏ విధంగా స్పందిస్తుంద‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

Also Read : Jalagam Venkat Rao : BRSకు ఆ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నాడా?