TDP Motha Mogiddam : చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ‘మోత మోగిద్దాం’ (Motha Mogiddham) అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే.. చంద్రబాబు గారికి మద్దతుగా… సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి’ (Motha Mogiddham) అంటూ నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చారు.
ఈ పిలుపు తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి ప్లేట్ మీద గరిటెతో, విజిల్ తో ఇలా ఎన్నో రకాలుగా మోత మోగించారు. చిన్న పిల్లల దగ్గరి నుండి పండు ముసలి వారి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కు మద్దతు ప్రకటించారు. అలాగే మోత కు సంబదించిన వీడియోస్ కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం చేసారు. అక్టోబర్ 03 వరకు ఇలాగే రకరకాల వినూత్న కార్యక్రమాలను టీడీపీ ప్లాన్ చేసింది. నారా భువనేశ్వరి హైదరాబాద్ లో మోత మోగించగా..నారా బ్రహ్మణి రాజమండ్రి లో , లోకేష్ ఢిల్లీ లో మోత మొగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also : Telangana : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలతో..కేసీఆర్ కు చలి జ్వరం – రేవంత్ రెడ్డి