ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) కు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని టాప్ 5 సీఎం లలో చంద్రబాబు కు స్థానం దక్కింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood Of The Nation) పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా ‘ఇండియా టుడే- సీ ఓటర్’ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఇందులో… అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు సీఎంస్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక ఫస్ట్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. సీఎంగా బాధ్యతలను చేపట్టిన రెండు నెలల సమయంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల జాబితాలోకి చంద్రబాబు రావడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చంద్రబాబు రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు ఆయన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో జరిగిన ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ఇటు రాష్ట్రలో, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి, చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఆయన నైజం. ఇక సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే తన మార్క్ కనపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నింపుతూ..ఈరోజు టాప్ 5 సీఎం లలో ఒకరిగా గుర్తింపు సాధించారు.
Read Also : Water After Food : తిన్న వెంటనే నీళ్లు త్రాగడం మంచిదా కాదా..? నిపుణుల నుండి తెలుసుకోండి..!