Site icon HashtagU Telugu

Telugu Bhasha Dinotsavam : తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్న మోడీ

Modi (8)

Modi (8)

నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి (Gidugu Venkata Ramamurthy Jayanti). మనం ప్రతి యేటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం (Telugu Language Day) జరుపుకొంటాము. ఈ సందర్బంగా తెలుగు వారే కాదు ఇతర భాషల వారు కూడా తెలుగు భాష గురించి, గొప్పతనం గురించి మాట్లాడుకుంటుంటారు.

నేడు తెలుగు భాషకు గిడుగు చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఉదయం నుండి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు తెలుగు బాష పట్ల స్పందిస్తూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ (PM Modi)..తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు లో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు. “తెలుగు నిజంగా చాలా గొప్ప భాష‌. భార‌త‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌దైన ముద్ర వేసింది. తెలుగును మ‌రింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారంద‌రినీ అభినందిస్తున్నాను” అని ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలుగు భాషా దినోత్సవం రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికి విషెష్ అందించారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులను నేడు తలచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని ట్విటర్ వేదికగా చంద్రబాబు తెలిపారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్ బాధ్యతను మనం తీసుకుందామన్నారు. అదే వారికి మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.

తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నవతరానికి తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేయాలని కోరారు. ‘ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగుకు ప్రాధాన్యం కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాష విలువ తెలియజేయాలి. తెలుగు తీయదనాన్ని భావితరాలకు అందించాలి. నిత్య వ్యవహారాల్లో తెలుగుకు పట్టం కడితేనే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత’ అని ఆయన పేర్కొన్నారు.

Read Also : Pithapuram : మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్