CBN Birthday : చంద్రబాబుకు మోదీ, రేవంత్, చిరు, జగన్ శుభాకాంక్షలు

CBN Birthday : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తదితరులు చంద్రబాబుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు

Published By: HashtagU Telugu Desk
Cbn Bday Wishesh

Cbn Bday Wishesh

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పుట్టినరోజు (Chandrababu Birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల జల్లు కురిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తదితరులు చంద్రబాబుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “నా మిత్రుడు, సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే “ప్రజాసేవలో నిమగ్నమై, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే చంద్రబాబుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి” అని రేవంత్ ఆకాంక్షించారు.

Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

చిరంజీవి కూడా తన ట్వీట్‌లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. “కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను,” అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత స్థాయిలో శుభాకాంక్షలు తెలియజేయడం నేతల పౌరసంబంధాలను చూపిస్తుంది.

పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌లో చంద్రబాబు నాయకత్వ విశేషాలను విశ్లేషిస్తూ పేర్కొన్నారు. “అనితర సాధ్యుడు చంద్రబాబు. ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం ఆయన వంటి దార్శనికునికే సాధ్యమవుతుంది. భవిష్యత్తు కోసం ముందుగానే ప్రణాళికలు రచించి, వ్యవస్థల్ని రూపొందించే ఆయన శైలి మనకు స్ఫూర్తిదాయకం” అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని పట్ల ప్రతి శుభాకాంక్షలోనూ గౌరవం, గుర్తింపు కనబడింది. ఇది ఆయన పాలనాపై ప్రజల్లో నెలకొన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.

  Last Updated: 20 Apr 2025, 10:57 AM IST