Modi Option : ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామి? లేదా చంద్ర‌బాబుకు చెక్.!

టీడీపీ అధినేత చంద్ర‌బాబును బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు (Modi Option)టార్గెట్ చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌కు జూలై మూడు త‌రువాత స‌మాధానం రానుంది.

  • Written By:
  • Publish Date - July 1, 2023 / 01:43 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబును బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు (Modi Option)టార్గెట్ చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌కు జూలై మూడు త‌రువాత స‌మాధానం రానుంది. ఆ రోజున కేంద్ర క్యాబినెట్ మార్పుల‌పై చ‌ర్చ‌కు అనుగుణంగా రాబోవు రోజుల్లో టీడీపీ, బీజేపీ క‌లుస్తాయా? లేదా? అని తేల‌నుంది. జాతీయ స్థాయిలో మారుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో చంద్ర‌బాబు అవ‌స‌రం ఉంద‌నుకుంటే మంత్రివ‌ర్గంలో టీడీపీ ఎంపీల‌కు అవ‌కాశం ల‌భించే అవ‌కాశం ఉంది.

జాతీయ స్థాయిలో మారుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో చంద్ర‌బాబు అవ‌స‌రం (Modi Option) 

ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీలుగా రామ్మోహ‌న్ నాయుడు, గ‌ల్లా జ‌య‌దేవ్‌, కేశినేని నాని ఉన్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర తొలిసారి ఎంపీ. ఇక మిగిలిన టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీని విలీనం చేసి బీజేపీ గూటికి చేరిన విష‌యం విదిత‌మే. ఎన్డీయేలో టీడీపీని భాగ‌స్వామ్యం చేసుకోవాలంటే, ముగ్గురు ఎంపీల్లో ఒక‌రికి క్యాబినెట్ బెర్త్ దొరుకుతుంది. సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా బీసీ రామ్మోహ‌న్ నాయుడు ఉన్నారు. మిగిలిన ఇద్ద‌రు క‌మ్మ సామాజిక‌వ‌ర్గం. ప్ర‌స్తుతం బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తోన్న టీడీపీ రామ్మోహ‌న్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. పైగా బీజేపీ అధిష్టానంతో రామ్మోహ‌న్ నాయుడు క‌లివిడిగా  (Modi Option)ఉంటార‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌.

ప్ర‌త్యేకించి ద‌క్షిణ భార‌త దేశ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనంగా

ఎన్డీయే భాగస్వామ్యం ఇటీవ‌ల బ‌ల‌హీన‌ప‌డింది. పైగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింది. జాతీయ స్థాయిలో విప‌క్ష కూట‌మి బ‌ల‌ప‌డుతోంది. దానికి నితీష్ కుమార్ సార‌థ్యం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే, ఇప్పుడు ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను పెంచుకునే దిశ‌గా ఆలోచిస్తోంది. ప్ర‌త్యేకించి ద‌క్షిణ భార‌త దేశ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. ఎక్క‌డా ఆ పార్టీ ఉనికి లేదు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో సౌత్ అంతా క‌మ‌ల‌నాథుల‌కు (Modi Option)  చోటులేదు. అందుకే, ఎన్డీయే ప‌క్షాల‌ను ద‌క్షిణ భార‌తంలో పెంచుకోవాల‌ని చూస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి చాటుకునే అవ‌కాశం

ఎన్డీయే పూర్వ‌పు స్నేహితుడు చంద్ర‌బాబు. ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో క‌లుసుకున్నారు. ఆ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ పొత్తు అనే అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజా ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావ‌డానికి టీడీపీ సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి చాటుకునే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ పెద్ద‌ల అభిప్రాయం. అందుకే, కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌డం ద్వారా(Modi Option)టీడీపీని భాగ‌స్వామ్యం చేసుకోవాల‌ని ఎత్తుగ‌డ ర‌చించిందని తెలుస్తోంది.

Also Read : CBN strategy : జ‌గ‌న్ పై కేసీఆర్ `భూ` చ‌క్రాన్ని వ‌దిలిన‌ చంద్ర‌బాబు

ఒక వేళ ఎన్డీయేలో భాగ‌స్వామ్యం చేసుకోకుండా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడుగా స‌త్య‌కుమార్ యాద‌వ్ కు ప‌ద‌విని అప్ప‌గిస్తే మాత్రం క‌మ‌ల‌నాథులు చంద్ర‌బాబుపై వ్యూహం ప‌న్నుతున్నార‌ని భావించాలి. ఎందుకంటే, ఏపీలో బ‌ల‌మైన బీసీ సామాజిక‌వ‌ర్గం టీడీపీకి అండ‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న సోమువ్రీర్రాజు బ‌దులుగా స‌త్య‌కుమార్ యాద‌వ్ ను బీజేపీ చీఫ్ గా నియ‌మిస్తే, రాబోవు రోజుల్లో చంద్ర‌బాబును డ్యామేజ్ చేస్తూ కింగ్ మేక‌ర్ గా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంచ‌నా వేయొచ్చు. ఎందుకంటే, జ‌న‌సేన , బీజేపీ పొత్తు కొన‌సాగుతోంది. కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి ఉన్నారు. ఇక బీజేపీకి చీఫ్ గా యాద‌వ సామాజిక‌వ‌ర్గంకు చెందిన స‌త్య‌కుమార్ కు అప్ప‌గిస్తే,అటు బీసీలు ఇటు కాపుల కాంబినేస‌న్ తో చంద్ర‌బాబును రాజ‌కీయంగా బ‌ల‌హీన ప‌రిచే ఎత్తుగ‌డ బీజేపీ ర‌చించింద‌ని  (Modi Option)అనుకోవాలి. జూలై 3న టీడీపీ ఎన్డీయేలో భాగ‌స్వామ్య‌మా? బీజేపీకి చంద్ర‌బాబు టార్గెట్ కాబోతున్నారా? అనేది తేల‌నుంది.

Also Read : CBN target : వైసీపీ బ‌లంపై చంద్ర‌బాబు గురి