MLC Result: సైకిల్ స్పీడ్‌, `ముంద‌స్తు` దిశ‌గా జ‌గ‌న్‌!

ఏపీ సీఎం ముంద‌స్తు(MLC Result) ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మా? ఢిల్లీ అందుకే వెళ్లారా?

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 05:44 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ముంద‌స్తు(MLC Result) ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మా? ఢిల్లీ అందుకే వెళ్లారా? ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆయ‌న మైండ్ ను బ్లాక్ చేశాయా? అందుకే, తెలంగాణ ఎన్నిక‌ల‌తో వెళ్లాల‌ని భావిస్తున్నారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటే, ఔను ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) పావులు క‌దుపుతున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం.

తెలంగాణ ఎన్నిక‌ల‌తో  ఏపీ వెళ్లాల‌ని..(MLC Result)

ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా(MLC Result) వెనుక‌బ‌డింది. ప్ర‌త్యేకించి తూర్పు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీ మీద వ్య‌తిరేకత వ్య‌క్తం అయింది. అధికార ద‌ర్పం ఎంత ప్ర‌యోగించిన‌ప్ప‌టికీ ఓట‌ర్లు మాత్రం జ‌గన్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద తిరగబ‌డ్డారు. ఆ రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ వైపు క్లియ‌ర్ గా ఓట‌ర్లు మొగ్గుచూపారు. ఇక ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో కొంత మేర‌కు వైసీపీ అభ్యర్థి పోటీ ఇస్తున్నప్ప‌టికీ తెలుగుదేశం పార్టీదే పైచేయిగా క‌నిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. సెమీ ఫైన‌ల్ గా భావిస్తోన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌బ్లిక్ మూడ్ క్లియ‌ర్ గా బ‌య‌ట ప‌డింది. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) దిగార‌ని తెలుస్తోంది.

Also Read : Jagan 3.0: ఉగాదికి జగన్ 3.0, ఎన్నికల మంత్రివర్గం ఇదే?

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు, ప‌రిపాల‌న‌లోని పొర‌బాట్లు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అవ‌గాహ‌న లోపం, మూడు రాజ‌ధానులు, అమ‌రావ‌తి రైతుల ప‌ట్ల వ్య‌తిరేక‌త‌, కులాల ప‌రంగా రాజ‌కీయం వెర‌సి వైసీపీకి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని ఎమ్మెల్సీ ఫ‌లితాలు(MLC Result) చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో ఏడాది పాటు పరిపాల‌న సాగిస్తే మ‌రింత వ్య‌తిరేక‌త వ‌చ్చేందుకు అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. అందుకే, ఈ ఏడాది జ‌రిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఆలోచిస్తున్నార‌ట‌. ఆ దిశ‌గా త‌న ఆలోచ‌న‌లు పంచుకోవ‌డానికి మోడీ, అమిత్ షా తో భేటీ అయ్యార‌ని కూడా టాక్ ఉంది.

తూర్పు రాయ‌ల‌సీమ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ మోజార్టీ

వైనాట్ 175 దేవుడెరుగు ప‌ట్టుమ‌ని ప‌ది మంది ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారా? లేదా అనే ప‌రిస్థితికి వైసీపీ ప‌డిపోయింద‌ని ఎమ్మెల్సీ ఫ‌లితాలు (MLC Result)చెబుతున్నాయి. ఎందుకంటే, తూర్పు రాయ‌ల‌సీమ ప‌రిధిలోని జిల్లాల్లో 2019 ఎన్నిక‌ల సంద‌ర్బంగా టీడీపీ కేవ‌లం 5 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. ఆ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో న‌లుగురు ఎమ్మెల్యేలు కేవ‌లం ప్ర‌కాశం నుంచి ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి చంద్ర‌బాబు ఒక్క‌రే గెలిచారు. ఇక నెల్లూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా టీడీపీ గెలుచుకోలేక‌పోయింది. అలాంటి తూర్పు రాయ‌ల‌సీమ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ మోజార్టీతో ఎమ్మెల్సీ అభ్య‌ర్థి శ్రీకాంత్ కంచ‌ర్ల గెలుపు దిశ‌గా వెళుతున్నారు. ఇక ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప్రాంతం మొత్తం మీద ప‌య్యావుల కేశవ్‌, బాల‌క్రిష్ణ మాత్ర‌మే గెలిచారు. అంటే, ఇద్ద‌రు ఎమ్మెల్యేలను మాత్ర‌మే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థికి నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీ ఇస్తున్నారు.

Also Read : TDP : చంద్ర‌బాబు చాణ‌క్యం, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు జ‌ల‌క్!

సాధార‌ణంగా ఉత్త‌రాంధ్ర ప‌బ్లిక్ మూడ్ ఆధారంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు ఉంటుంద‌ని ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌లో జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, ఆ పార్టీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థులు భారీ మోజార్టీతో గెలుపు (MLC Result)దిశ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్క‌దాన్ని వైసీపీ గెలుచుకుంది. అయిన‌ప్ప‌టికీ ఉత్త‌రాంధ్ర యువ‌త‌, సామాన్యుల మూడ్ అంతా టీడీపీ వైపు ఉంద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే మ‌రింత న‌ష్ట‌పోతామ‌నే ఆలోచ‌న‌లో వైసీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల‌తో ఏపీని కూడా తీసుకెళితే ప‌లు విధాలుగా లాభం ఉంటుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) అంచ‌నా వేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

మ‌రో ఛాన్స్ కొట్టేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పావులు

కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం తొలి నుంచి జ‌గ‌న్మోహన్ రెడ్డి(Jagan) సంపూర్ణంగా ఉంది. అలాగే, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అండ‌గా ఉన్నారు. ఇద్ద‌ర్నీ ఉప‌యోగించుకుని మ‌రో ఛాన్స్ కొట్టేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పావులు క‌దుపుతున్నార‌ట‌. సాధార‌ణ ఎన్నిక‌లు ముందుస్తుగా వ‌స్తే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు అండ‌గా ఉంటార‌ని ఒక ఎత్తుగ‌డ‌. ఇక తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన ఓట‌ర్లు సుమారు 8ల‌క్ష‌ల‌కు పైగా ఏపీ ఉంటార‌ని అంచ‌నా. వాళ్ల‌లో ఎక్కువ మంది వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ఒక స‌ర్వేలోని సారాంశం. వాళ్లంద‌రూ ఓటుకు ఏపీకి వ‌స్తే న‌ష్టం భారీగా ఉంటుంద‌ని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే..

అందుకే, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే, తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది ఆగిపోయే అవ‌కాశం ఉంది. సెటిల‌ర్లు ప్ర‌స్తుతం బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఈ ప‌రిణామం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు కూడా లాభిస్తోంది. హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియా సెటిల‌ర్లు బీజేపీకి సాలిడ్ గా ఉన్నార‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఫ‌లితాలు చెబుతున్నాయి. ఇలాంటి అంచ‌నాల న‌డుమ అటు కేసీఆర్ కు స‌హాయం చేసిన‌ట్టు ఇటు కేంద్రం అండ‌తో మ‌ళ్లీ ఇంకో ఛాన్స్ ఏపీలో కొట్టేయొచ్చ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీ ఈక్వేష‌న్ గా ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, ఆ దిశ‌గా ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సుల కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) వెళ్లార‌ని వైసీపీలోని టాక్. తాజాగా వెలువ‌డుతోన్న ఎమ్మెల్సీ ఫ‌లితాలు (MLC Result) కూడా ప్ర‌తికూలంగా రావ‌డంతో ముంద‌స్తు మిన‌హా వైసీపీకి మ‌రో మార్గంలేద‌ని రాజ‌కీయ పండితులు అంచ‌నా వేయ‌డంలో అర్థం లేక‌పోలేదు.