MLC Result Effect : రోజా,పెద్దిరెడ్డితో స‌హా 10 మంది ఔట్‌?

ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల(MLC Result Effect) త‌రువాత

  • Written By:
  • Updated On - March 18, 2023 / 03:08 PM IST

`మీ ప‌నితీరును గ‌మ‌నిస్తున్నా, జాగ్ర‌త్త‌గా ఉండండి` అంటూ ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొంద‌రు మంత్రుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల(MLC Result Effect) త‌రువాత మంత్రుల (Cabinet)మీద ఆయ‌న చిర్రెత్తిపోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి బ‌రిలోకి దిగిన అనురాధ గెలిచేలా ఉన్న వాతావ‌ర‌ణాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. అందుకే మంత్రి వ‌ర్గం ప్ర‌క్షాళ‌న‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం.

ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల(MLC Result Effect)

మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి,రోజా మ‌ధ్య అంత‌ర్యుద్ధం తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల‌పై ప‌డింద‌ని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు, నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్న కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డికి ఈ ఫ‌లితాలు ప‌ద‌వీ గండాన్ని తెచ్చిపెట్టాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక నెల్లూరు, ప్ర‌కాశం జిల్లా కో ఆర్డినేట‌ర్ గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్య‌వ‌హారం కూడా వివాద‌స్ప‌దంగా ఉంది. ఆయ‌న మీద వైశ్యులు ఎక్కువ‌గా వ్య‌తిరేకంగా ఉన్నారు. అంతేకాదు, ఇటీవ‌ల బాలినేని మీద వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. ఆ ప్ర‌భావం ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల(MLC Result Effect) మీద ప‌డింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల అంచ‌నాగా ఉంద‌ని తెలుస్తోంది. ఇక పశ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఫ‌లితాల్లో కూడా వైసీపీ పెద్ద‌గా సాధించిన విజ‌యం ఏమీ క‌నిపించ‌డంలేదు. దీంతో అక్క‌డి మంత్రుల‌కు(Cabinet) కూడా ఉద్వాస‌న ప‌లికే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి,రోజా మ‌ధ్య అంత‌ర్యుద్ధం

ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో పూర్తిగా వైసీపీకి వ్య‌తిరేక గాలి వీస్తోంది. అక్క‌డ జ‌రిగిన భూ కుంభ‌కోణాలు, మంత్రుల మ‌ధ్య స‌మ‌న్వ‌య (Cabinet)లోపం ఫ‌లితాల మీద ప‌డింది. ప్ర‌త్యేకించి మంత్రి అప్ప‌ల‌రాజు అవినీతి వ్య‌వ‌హారం బ్యాలెట్ బాక్స్ ల్లోనూ ద‌ర్శ‌నం ఇచ్చింది. ఆయ‌నపై ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ ఓట‌ర్లు లేఖ‌ల‌ను బ్యాలెట్ బాక్స్ ల్లో వేయ‌డం వైసీపీ అధిష్టానంకు మ‌తిపోయేలా ఉంది. విశాఖ కేంద్రంగా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కొన్నేళ్ల పాటు రాజ్యం ఏలారు. ఆ త‌రువాత ఆయ‌న స్థానంలో టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో మార్పు రాలేదు. అక్క‌డ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నోటి దురుసుత‌నం కూడా ఎన్నిక‌ల మీద ప‌డింద‌ని టాక్‌. ఓట్లు వేయ‌క‌పోతే విశాఖ రాజ‌ధాని పోతుంద‌ని మంత్రులు ధ‌ర్మాన‌, గుడివాడ , బొత్సా త‌దిత‌రులు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ వైసీపీకి వ్య‌తిరేకంగా ఓట‌ర్లు తిర‌గ‌బ‌డ్డారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మంత్రివ‌ర్గాన్ని పూర్తి స్థాయిలో (MLC Result Effect)ప్ర‌క్షాళ‌న చేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : MLC Result: సైకిల్ స్పీడ్‌, `ముంద‌స్తు` దిశ‌గా జ‌గ‌న్‌!

మూడు రాజ‌ధానులు, నిరుద్యోగం పెరుగుద‌ల‌, ప‌రిపాల‌న లోపాలు వెర‌సి ఏపీలోని ప‌ట్ట‌భ‌ద్రులు నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఫ‌లితాలు అద్దంప‌డుతున్నాయి. అధికార పార్టీ అవున‌న్నా, కాద‌న్నా ఈ ఫ‌లితాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పరిపాల‌న‌కు గీటురాయిగా(Cabinet) చెప్పుకోవాలి. ఎందుకంటే, ప‌ట్ట‌భ‌ద్రులు మాత్ర‌మే ఓటింగ్ లో పాల్గొన్న ఎన్నిక‌లు ఇవి. అంతేకాదు, రెండో నియోజ‌క‌వ‌ర్గాల్లో టీచ‌ర్లు ఓట‌ర్లుగా జ‌రిగాయి. మూడు ప‌ట్ట‌భ‌ద్రులు, రెండు టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాలు(MLC Result Effect) ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని అంచ‌నా వేయ‌డాన్ని కాద‌న‌లేం.

 ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా  ఫ‌లితాలు ఉన్నాయ‌ని

గెలుపు కోసం అధికారంలో ఉన్న వైసీపీ చేసిన అఘాత్యాలు అంద‌రూ చూశారు. ఓట‌ర్ల జాబితా త‌యారీ నుంచి దొంగ ఓట్ల వ‌ర‌కు ఆ పార్టీ చేసిన విన్యాసాలు అంద‌రికీ తెలిసిన‌వే. డిగ్రీ చ‌ద‌విన వాళ్లుగా 7వ త‌ర‌గ‌తి వాళ్ల‌ను కూడా ఓట‌ర్లుగా అధికార పార్టీ (Cabinet)చూపించింది. కొన్ని వేల ఓట్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా అక్ర‌మంగా చేర్చారు. ఆ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ కు టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. ఇక ప్రైవేటు టీచ‌ర్ల‌కు కూడా ఓటు హ‌క్కు క‌ల్పిస్తూ టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వెసుల‌బాటును క‌ల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే, వ‌లంటీర్ల ద్వారా ప్ర‌భుత్వం చేసిన అక్ర‌మాలు అనేకం. వాటిని అధిగ‌మిస్తూ డ‌బ్బు, మ‌ద్యం పంచ‌కుండా టీడీపీ గెలిచిన ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో `ఫ్యాన్` రెక్క‌లు (MLC Result Effect)విరిగిపోతాయ‌ని ఎవ‌రైనా అంచ‌నా వేయ‌గ‌ల‌రు.

  త‌ట‌స్థ ఓట‌ర్ల‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేక‌త (Cabinet)

సాధారణంగా త‌ట‌స్థ ఓట‌ర్లు గెలుపోట‌ముల‌ను నిర్దేశిస్తారు. ఏ ఎన్నిక‌ల్లోనైనా ఫ‌లితాల‌ను శాసించే ఓట‌ర్లు వాళ్లే. ఇప్పుడు జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పాల్గొన్న ఓట‌ర్ల‌లో 80శాతం త‌ట‌స్థ ఓట‌ర్లు ఉంటారు. వాళ్లు డ‌బ్బు, మ‌ద్యం, కులం, ప్రాంతం త‌దిత‌ర ప్ర‌లోభాల‌కు లొంగరు. రాష్ట్ర అభివృద్ధి, స‌మాజ ప్ర‌గ‌తి, శాంతిభ‌ద్ర‌త‌లు ఇలాంటి అంశాల‌ను బేరీజు వేసుకుని ఓటు చేస్తారు. త‌ట‌స్థ ఓట‌ర్ల మ‌న‌సును భావోద్వేగాల‌తోనూ మార్చ‌లేరు. అందుకే, ఇప్పుడు వ‌చ్చిన ఫ‌లితాల‌ను వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల(MLC Result Effect) నాటి వాతావ‌ర‌ణానికి అనుసంధానం చేసి చూడ‌డానికి అవ‌కాశం ఉంది. విద్యావంతులు ఎక్కువ‌గా పాల్గొన్న ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేక‌త బాగా ఉంద‌ని ఫ‌లితాలు తేల్చేశాయి. అంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న మీద (Cabinet)విసుగెత్తిపోయార‌ని అర్థ‌మ‌వుతోంది.

Also Read : MLC Elections Counting : ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ని త‌ల‌పిస్తున్న వెస్ట్ రాయ‌ల‌సీమ ఎమ్మెల్సీ కౌంటింగ్‌

మూడు రాజ‌ధానుల అంశానికి బెంచ్ మార్క్ గా ఈ ఎన్నిక‌ల‌ను వైసీపీ(Cabinet) ప్రొజెక్ట్ చేసింది. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీ ప్ర‌చారం మూడు రాజ‌ధానుల మీద విస్తృతంగా చేసింది. విశాఖ రాజ‌ధాని వ‌ద్దా? కావాలా? అనే అంశాన్ని. తేల్చేసే ఎన్నిక‌లంటూ మంత్రులు, ఉత్త‌రాంధ్ర ఇంచార్జిగా ఉన్న వైసీపీ సుబ్బారెడ్డి సైతం ప్ర‌చారం చేశారు. ఇలాంటి ప్ర‌చారాన్ని ప‌శ్చిమ‌, తూర్పు రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోనూ వినిపించారు. సీన్ క‌ట్ చేస్తే, మూడు రాజ‌ధానులు అవస‌రంలేద‌ని చెప్పేలా ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్లు స‌మాధానం ఇచ్చారు. ఆ రెండు ప్రాంతాల్లోనూ(MLC Result Effect) టీడీపీ హ‌వా క‌నిపించింది.

వార్ వ‌న్ సైడ్ మాదిరిగా ఫ‌లితాలు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాన్ని వెలుగెత్తి చాటారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న అరాచ‌కాలు, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును గురించి బాగా ప్ర‌చారం చేశారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలోనూ టీడీపీ అభ్య‌ర్థికి ఎక్కువ‌గా ఓట్లు రావ‌డం క‌నిపించింది. క‌డ‌ప జిల్లాలోని ప‌ట్ట‌భ‌ద్రులు సైతం సైకిల్ ఎక్కారు. ఈ ప‌రిణామం ఏపీకి ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తిని మెజార్టీ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. నిరుద్యోగులు వైసీపీ ప్ర‌భుత్వంపై(Cabinet) తిరగ‌బ‌డ్డారు. వార్ వ‌న్ సైడ్ మాదిరిగా ఫ‌లితాలు క‌నిపించ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు చెంప‌పెట్టు. ఈ ఫ‌లితాల‌ను చూసిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌నీసం 10 మంది మంత్రుల‌ను(MLC Result Effect) మార్చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం మొద‌లైయింది.

Also Read : MLC Results: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ హవా! MLC ఫలితాలు జగన్ కు రివర్స్