ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN), వ్యవసాయ రంగంపై ప్రజా ప్రతినిధులు మరింత శ్రద్ధ పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ నుంచి ప్రతి ఎమ్మెల్యే (MLA) నెలలో ఒకరోజు తమ నియోజకవర్గంలోని పొలాల్లో (Agriculture ) గడపాలని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు, పరిష్కార మార్గాలు చూపేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు రైతులకు ఎలా చేరుతున్నాయో ప్రత్యక్షంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Hussain Sagar 2.0: హుస్సేన్‌సాగర్ నయా లుక్..స్కై వాక్ తో పాటు మరెన్నో !!
రైతుల సమస్యలను తాను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సీఎం ప్రకటించారు. త్వరలోనే అన్నదాతలను స్వయంగా కలుస్తానని తెలిపారు. పంట ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. ధరల పతనం వల్ల రైతులు నష్టపోకుండా పంట కొనుగోలు, మద్దతు ధర అమలు, ఆర్థిక సహాయం వంటి అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం కోసం రైతు-ప్రభుత్వం మధ్య బలమైన సంబంధం ఏర్పడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రసాయన ఎరువుల అధిక వాడకం భూమి సారాన్ని తగ్గిస్తున్నందున, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భూసార పరీక్షలు చేసి, రైతులకు అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తామని తెలిపారు. పంటల ఉత్పత్తి పెరిగి, నాణ్యత మెరుగుపడాలంటే శాస్త్రీయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సమగ్ర వ్యవసాయ విధానంతోనే రైతు సంతోషం సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
