ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి..మొన్నటి వరకు టీడీపీ , వైసీపీ , జనసేన , బిజెపి (పెద్దగా ప్రభావం లేదు ) లు మాత్రమే బరిలో నిల్చుంటాయని అనుకున్నారు..కానీ ఇప్పుడు వైస్ షర్మిల (YS Sharmila ) కాంగ్రెస్ (Congress) గూటికి చేరడం..త్వరలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుందని బలంగా వినిపిస్తుండడం తో..కాంగ్రెస్ నేతలంతా మళ్లీ యాక్టివ్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, లగటపాటి రాజగోపాల్ , హర్ష వర్ధన్ ఇలా వైస్ హయాంలో కీలక నేతలుగా వ్యవహరించిన వారంతా బయటకు వస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా ఉన్న నేతలు , కార్యకర్తలు , మాజీ ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా వైసీపీ పార్టీ టికెట్ రాని నేతలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి..ఇప్పటికే వైసీపీ కి రాజీనామా చేయడం జరిగింది. ఈయన షర్మిల వెంట నడవబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Reddy) సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తుంది. కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో కాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రఘువీరారెడ్డి నేతృత్వంలో ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను కలుస్తారని సమాచారం.
కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాపు భావిస్తున్నారు. ఈ సందర్బంగా ఇక్కడ భారీ సభ ఏర్పటు చేసి..షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రఘువీరారెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరారెడ్డిని కలిసేందుకు వచ్చానని ఎమ్మెల్యే కాపు చెప్పుకొచ్చారు. కేవలం ఈయన మాత్రమే కాదు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టిన తర్వాత చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Also : MP Kesineni Nani : వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్న కేశినేని నాని..?