Jr NTR Fans: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి – ఫ్యాన్స్ డిమాండ్

Jr NTR Fans: తమ అభిమాన నటుడిని లక్ష్యంగా చేసుకుని దగ్గుపాటి ప్రసాద్ బూతులు తిట్టారంటూ ఆడియో క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది

Published By: HashtagU Telugu Desk
Ntrfans Durgaprasad

Ntrfans Durgaprasad

అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌( MLA Daggubati Venkateswara Prasad)పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు (NTR fans) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడిని లక్ష్యంగా చేసుకుని దగ్గుపాటి ప్రసాద్ బూతులు తిట్టారంటూ ఆడియో క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న అభిమానులు, వెంటనే దగ్గుపాటి ప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా, ఎమ్మెల్యే బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని వారు పట్టుబడుతున్నారు.

Number Plate: దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కాస్ట్ ఎంతో తెలుసా?!

ఈ వివాదం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. “#SuspendMLADaggupatiPrasad” అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు తమ ఆగ్రహాన్ని, డిమాండ్లను ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా తెలియజేస్తున్నారు. డిజిటల్ నిరసనలతో పాటు, క్షేత్రస్థాయిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దగ్గుపాటి ప్రసాద్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేస్తూ, వాటిపై కోడిగుడ్లు విసురుతూ తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కొత్త తలనొప్పిగా మారాయి.

CM Chandrababu: సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు, పార్టీ వ్యవహారాల‌పై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌!

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చురుగ్గా లేనప్పటికీ, ఆయనకు ఉన్న అభిమాన గణం, దాని బలం తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న టీడీపీకి, ఈ వివాదం మరింత ఇబ్బందికరంగా మారింది. అభిమానుల డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే అంతర్గత విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉండగా, మరోవైపు చర్యలు తీసుకోకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యను తెలుగుదేశం పార్టీ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

  Last Updated: 18 Aug 2025, 06:31 AM IST