MLA Arani Srinivasulu : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును సస్పెండ్ చేసిన వైసీపీ

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 09:15 PM IST

చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(YCP MLA Arani Srinivasulu)ను వైసీపీ పార్టీ (YCP) నుండి సస్పెండ్ (Suspend) చేసింది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ లో నేతలు వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు. సర్వేల పేరుతో జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో వారంత బయటకు వస్తూ టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు ఇలా ఎంతో మంది వైసీపీ ని వీడగా…చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను కలిశారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాదులో పవన్ ను కలిసిన ఆరణి శ్రీనివాసులు తన భవితవ్యంపై చర్చించారు. నియోజకవర్గాల ఇన్చార్జిలను బదిలీ చేస్తున్న వైసీపీ అగ్రనాయకత్వం చిత్తూరు అసెంబ్లీ స్థానానికి విజయానందరెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఈ నియామకంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఆయన జనసేన లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆరణి శ్రీనివాసులు..పవన్ కళ్యాణ్ ను కలిసిన కొద్దీ గంటల్లోనే వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని అర్ధం కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.

Read Also : Vyooham : జగన్ కు ఫేవర్ గానే వ్యూహం తీశా – వర్మ