వైసీపీ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం (Liquor Scam)లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (Midhun Reddy)కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో మిథున్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారని, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారని పేర్కొన్నారు. రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని ఆయన వాదించారు. డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి వచ్చిన రూ.5 కోట్లు మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కి చేరాయని, ఆ కంపెనీ మిథున్‌రెడ్డి కుటుంబానికి చెందినదేనని పేర్కొన్నారు.
CM Revanth Reddy : సిక్స్ ప్యాక్ పై యువతకు సలహా ఇచ్చిన సీఎం రేవంత్
మద్యం కేసుకు సంబంధించి మిథున్‌రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్‌పై అప్పటికే ఆధారాలు ఉన్నాయని, ముడుపుల సొమ్ము చివరికి ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందన్న అంశంపై విచారణ కొనసాగుతోందని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడం అవసరమని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు నిందితులు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన వెల్లడించారు. పూర్తి వాదనల కోసం సమయం అవసరమై, విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తెలిపారు.
KTR : కావాలంటే 15 రోజులు జైలుకు పంపండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మిథున్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి, పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. డీకార్ట్ నుంచి వచ్చిన రూ.5 కోట్లను తిరిగి అదే సంస్థకు చెల్లించామని, ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందలేదన్నారు. ఇప్పటికే సిట్‌కు పూర్తి వివరణ ఇచ్చినట్టు తెలిపారు. మద్యం పాలసీలో మిథున్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, కేసులో ఇతర ప్రధాన నిందితులను పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేసి వేధించేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆయన వాదించారు.