Site icon HashtagU Telugu

Minister Rajini : చంద్ర‌బాబు, లోకేష్‌కు స‌వాల్ విసిరిన మంత్రి విడుద‌ల ర‌జ‌ని.. బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ అట‌

Minister Vidudala Rajni

Minister Vidudala Rajni

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుద‌ల ర‌జ‌నీ (Minister Vidudala Rajni) చంద్ర‌బాబు (Chandrababu), లోకేష్ (Lokesh) కు స‌వాల్ విసిరారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా లోకేష్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కంపై కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎంతోమంది పేదలకు ఆరోగ్య శ్రీ పథకంలో మెరుగైన వైద్యం అందుతుంది.? టీడీపీ హయాంలో ఆరోగ్య శ్రీ ఏవిధంగా అమలు అయిందో చర్చకు సిద్దమేనా అని నేను సవాల్ విసురుతున్నా అంటూ విడుద‌ల ర‌జ‌ని అన్నారు. ఆరోగ్య శ్రీ ని మీ హయాంలో అనారోగ్య శ్రీ గా మార్చింది నిజంకాదా అని ప్ర‌శ్నించారు. ఆరోగ్య శ్రీ ని టీడీపీ హయాంలో వెంటిలేటర్ పై ఉంచారని, అసలు ఈ ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చింది ఎవరో తెలుసా..? అంటూ ప్ర‌శ్నించారు.

ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని పేద‌ల‌కోసం దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. రాజశేఖ‌ర్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టార‌ని, టీడీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కాన్ని వెంటిలేట‌ర్ పై ప‌డుకోబెడితే.. వైఎస్ జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత పేద‌ల‌కు మ‌ళ్లీ ఆరోగ్య శ్రీ ప‌థ‌కం ఫ‌లాలు అందిస్తున్నార‌ని మంత్రి ర‌జ‌ని అన్నారు. 3,257 ప్రొసీజర్ లకు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప‌థ‌కాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం కింద 3,650 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నామ‌ని, మొత్తం 10,100 కోట్లు ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఖర్చు పెడుతున్నామ‌ని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 36 లక్షలమంది ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు.

వార్షిక ఆదాయం 5 లక్షలు రూపాయలలోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ ఉపయోగ పడుతుంద‌ని మంత్రి విడుద‌ల ర‌జ‌నీ చెప్పారు. కేన్సర్ పేషెంట్లకు 20లక్షల వరకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంద‌ని అన్నారు. సగటున 3400 మంది రోజుకు ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ఉపయోగించు కుంటున్నార‌ని తెలిపారు. జగనన్న పాలన మీద ప్రజల్లో క్రెడిబులిటీ ఉంది. ఆరోగ్య శ్రీ పైన, వైద్యరంగం పైన చంద్రబాబు, లోకేష్ లకు బహిరంగ సవాల్ విసురుతున్నా.. నా స‌వాల్ స్వీక‌రించి చ‌ర్చించే ద‌మ్ము మీకుందా అంటూ విడుద‌ల ర‌జ‌నీ ప్ర‌శ్నించారు.

Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ