ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం నుండి శుభవార్త వెలువడింది. ఆప్కోకు ఉత్పత్తులు సరఫరా చేసే సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల (Handloom Workers) వేతనాలను ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర మంత్రి సవిత (Minister Savithamma)ఈ విషయాన్ని వెల్లడించారు. కార్మికుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రతి నెల రూ.3వేల వేతనాన్ని అదనంగా ఇవ్వనున్నారు. ఇది వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలలో ఒక మార్పునకు దారితీయనుంది.
ICRISAT : ఇక్రిశాట్ క్యాంపస్ కు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లినట్లు..?
కేవలం వేతనాల పెంపుతోనే కాదు, చేనేత ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం.. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్‌కు రూ.129 నుంచి రూ.148కి పెంచబడగా, డైయింగ్ ఛార్జీలు రూ.362 నుంచి రూ.434కి పెరిగాయి. ఇది చేనేత ఉత్పత్తుల తయారీలో జమిలి విధానంలో పనిచేసే కార్మికుల ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. చేనేత పరిశ్రమకు ఇది ఆర్థిక ప్రోత్సాహకంగా మారుతుంది.
Tamil Nadu Assembly : బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు
మరోవైపు చేనేత ఉత్పత్తులకు నాణ్యతతో పాటు సంతృప్తికరమైన ధరలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బెడీడ్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100కి, టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40కి పెంచబడినట్లు మంత్రి తెలిపారు. ఈ మార్పులతో కార్మికులు మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా వినియోగదారులకు అధిక నాణ్యత గల చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా ఇది కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.