సినీ నటి మరియు బీజేపీ నేత మాధవీలత(Madhavilatha)పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ (JC Prabhakar) రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. అసలు మాధవీలత ను బీజేపీలో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని, ఆమె ఒక “వేస్ట్ క్యాండిడేట్” అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…
ఈ వివాదానికి కారణంగా కొత్త సంవత్సర వేడుకలు నిలిచాయి. న్యూ ఇయర్ సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఈవెంట్‌పై మాధవీలత తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ “జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లకూడదని, అక్కడ దారుణ ఘటనలు జరుగుతున్నాయి” అంటూ ఒక వీడియో విడుదల చేశారు. మాధవీలత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేసీ, ఆమెను మహిళలను అవమానించేలా మాట్లాడారంటూ విమర్శించారు. తాడిపత్రిలోని మహిళల కోసం నిర్వహించిన ఈవెంట్ మీద అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Maruti Suzuki : ఎస్‌యూవీల యుగంలో ఆల్టో దుమ్ము రేపింది..!
ఈ వివాదంపై మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar)స్పందిస్తూ, జేసీ వ్యాఖ్యలను ఖండించారు. “జేసీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. మాధవీలతపై అసభ్యకరంగా మాట్లాడడం కేవలం వ్యక్తిగత దూషణే కాకుండా, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్య” అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వివాదం బిజెపి – టీడీపీ పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలకు దారితీస్తోంది. మాధవీలతకు బీజేపీ నాయకత్వం మద్దతు తెలపగా, జేసీ తన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో..!!