Site icon HashtagU Telugu

Minister Roja: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్…

Minister Roja

Minister Roja

Minister Roja: వైసీపీ మంత్రి రోజా మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నా సవాల్ కు సిద్ధమా అంటూ మాటల తూటాలు పేల్చారు. టిడ్కొ ఇళ్ల ముందు నిలబడి చంద్రబాబు సెల్ఫీలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. అది సెల్ఫీ కాదు సెల్ఫ్ గోల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు.

“ఏపీలో మెగా సర్వే చేసే దమ్ము ఉందా చంద్రబాబు. జగనన్నకు దమ్ము ఉంది కాబట్టే మెగా సర్వేలో 7 లక్షల మంది పాల్గొన్నారు. ఏపీలో సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకే వైసీపీ అధికారానికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వాలంటీర్లు జగన్ కు సైనికులుగా పని చేస్తున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో పధకాలు సామాన్యులకు చేరాలంటే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి వాలంటీర్లు పధకాలు అందిస్తున్నారు”. మా పాలన ప్రజలకోసం పుట్టిన పాలన. మీ పాలన మీకోసం అన్నట్టు ఉండేదన్నారు రోజా.

ఈ మధ్య చంద్రబాబు టిడ్కొ ఇళ్ల ముందు నిల్చుని సెల్ఫీ తీసుకుని ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రవర్తించారు. నిజానికి అది సెల్ఫీ కాదు సెల్ఫ్ గోల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నా నగరి అభివృద్ధి చెందిందా? నీ కుప్పం అభివృద్ధి చెందిందా… తేల్చుకుందామా?. ఇదే నా సవాల్. నా సవాల్ ని స్వీకరించే దమ్ము ఉందా చంద్రబాబు అని ఘాటుగా స్పందించారు. వైసీపీ స్టిక్కర్ల మీద చంద్రబాబు దొంగ రాజకీయాలు చేస్తున్నారు. అర్ధ రాత్రి వెళ్లి మీ టీడీపీ, జనసేన స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

చంద్రబాబు ప్రత్యేక హోదాకి అడ్డుపడి కేంద్రం వద్ద ప్యాకేజి తీసుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారని విమర్శలు చేశారమే. నిరుద్యోగులను నిరుద్యోగ భృతి పేరు చెప్పి మోసం చేసిన ఘనత బాబుదే. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి నిరుద్యోగులను మోసం చేశాడు.సీఎం జగన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారు కాబట్టే ప్రజలు మాతో ఉన్నారు. అందుకే మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్లగలుగుతున్నామని తెలిపారు మంత్రి రోజా.

Read More: Minister Rk Roja: టీడీపీది పగటికలే.. ప్రజలు జగనన్నని మరోసారి కోరుకుంటున్నారు: మంత్రి రోజా

Exit mobile version