నగరి ఎమ్మెల్యే రోజా (Minister Roja)..మంత్రి అయ్యాక రాష్ట్రాన్ని డెవలప్ చేయడం దేవుడెరుగు కానీ ఆమె సొంత ఆస్తులను మాత్రం భారీగా పెంచుకున్నారని..ప్రతిపక్ష పార్టీల నేతలు కాదు సొంత వైసీపీ పార్టీ నేతలే అంటున్న మాట. గెలిపించిన ప్రజల దగ్గరి నుండి వసూళ్ల దందా చేసారంటే అంతకన్నా దారుణం ఏకేమన్న ఉంటుందా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు లో ఏంచేయాలన్న..ఏ రోడ్డు వేయాలన్న..ఏ పని చేయాలన్న ముందు రోజాకు ముడుపులు అందజేయాలని అక్కడి ప్రజలు అంటూ వస్తున్నారు. తాజాగా పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మంత్రి రోజాపై తీవ్ర ఆరోపణలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రోజా తనను రూ.70 లక్షలు డిమాండ్ చేశారని… చివరికి తాను రూ.40 లక్షలు ఇచ్చానని ఆరోపించారు. మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి తాను మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆఖరికి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వకపోగా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని భువనేశ్వరి ఆరోపించారు. వీరే కాదు వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లేశ్వరిలు సైతం రోజా వేధింపుల గురించి మీడియా కు వెల్లడించారు.
కక్ష సాధింపుతో రోజా తమను ఇబ్బందులకు గురి చేశారని.. ఆఖరికి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు రోజా ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా చేస్తున్నారని అన్నారు. భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జడ్పీటీసీలకు ప్రత్యేక గదులు కేటాయించలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను నిలదీశామని తెలిపారు. ఇంత చేస్తున్న రోజా కు ఈసారి టికెట్ ఇవ్వకూడదని సీఎం జగన్ ను కోరుతున్నారు. ఒకవేళ ఇస్తే మాత్రం ఓడగొట్టి ఇంటికి పంపిస్తామని తేల్చి చెపుతున్నారు.
Read Also : AP : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో షర్మిల భేటీ…ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిందా..?