తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy)..సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ (Vijayawada Kanaka Durga Temple) ను దర్శించుకున్నారు. వీరి వెంట మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు కూడా ఉన్నారు. మంత్రి పొంగులేటి కి వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. సాధరంగా ఆహ్వానం పలికి ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి దర్శనం చేయించారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి పొంగులేటికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అర్చకులు ఆశీర్వాదాలతో పాటు తీర్ధప్రసాదాలను అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానని పొంగులేటి చెప్పారు. 10ఏళ్లలో అభివృద్ధి పేరుతో కేసీఆర్.. 5లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారెంటీ హామీలను అమలు చేస్తుందని తెలిపారు. నాకు సీఎం జగన్ కు మధ్య వ్యక్తిగత సంబందాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పొంగులేటి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సమస్యను….అన్నదమ్ముల మాదిరి సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Also : CM Revanth Reddy Meets Jana Reddy : జానారెడ్డి ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి