Nimmala Ramanaidu : ప్రతిపక్ష హోదా రానీ ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే

Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Published By: HashtagU Telugu Desk
Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా వైసీపీ శ్రేణులు అమరావతి కొట్టుకుపోతుందని, బెజవాడ మునిగిపోతుందని రూమర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Indian Railways : భారత రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు.. విమానాల తరహాలో కొత్త రూల్స్!

రాయలసీమలో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న సమర్థవంతమైన వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్‌ వల్లే రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని మంత్రి వివరించారు. ఇది కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. అభివృద్ధి కొనసాగితే తమ ఉనికే ప్రశ్నార్థకమవుతుందనే భయంతో వైసీపీ నేతలు ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని నిమ్మల విమర్శించారు.

రాజకీయ ముసుగు ధరించి నేరస్థుల్లా పార్టీని నడుపుతున్నవారే వైసీపీ నేతలని ఆయన ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు పండుగలా జరుపుకునే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా జాతీయ జెండాను ఎగరవేయకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వింత పోకడలకు తెరలేపారని మంత్రి ఆరోపించారు. ప్రజలు ఇలాంటి నాయకత్వాన్ని ఇకపై తట్టుకోరని, రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను సమాజం తిప్పికొడుతుందని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Airtel : జియో బాటలో ఎయిర్‌టెల్..ఇక పై ఆ ప్లాన్స్ మరచిపోవాల్సిందే !!

  Last Updated: 20 Aug 2025, 01:16 PM IST