Site icon HashtagU Telugu

Amaravati : అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి నారాయణ ప్రకటన

Minister Narayana Statemen

Minister Narayana statement on commencement of Amaravati works

Amaravati: అమరావతి రాజధాని పనుల ప్రారంభంపై ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు  నేడు ఓ ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు క్రెడాయ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు అమరావతి రాజధాతో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కొత్త లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. తద్వారా రియల్ రంగాన్ని కూడా పరుగులు తీయించబోతున్నట్లు నారాయణ హింట్ ఇచ్చారు.

కాగా, ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ ఏపీకి కొత్త అర్దం చెప్పింది. ఇందులో అమరావతి రాజధాని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం..ఈరోజు పనుల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చింది. అలాగే ఇందుకు ఎంత ఖర్చుపెట్టబోతోందో కూడా వెల్లడించింది.

Read Also: Study : నిద్రలేమితో బరువు పెరుగుట, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీయవచ్చు