జనసేన పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) చేసిన తాజా వ్యాఖ్యలు (Shocking Comments) ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం (Chandrababu) కావడం వెనుక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్ర (Key Role) ఉందని స్పష్టం చేశారు. జనసేన మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, కూటమి విజయానికి జనసేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇటీవలి కాలంలో జనసేన-టీడీపీ మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా పదవుల పంపిణీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
CM Revanth : కేటీఆర్ పిచ్చోడు – సీఎం రేవంత్
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనసేనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న చంద్రబాబు హామీ అమలు కాలేదు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీ జాబితా విడుదల అయినా వర్మకు మొండి చేయి ఎదురైంది. జనసేన నేతలే ఆయనకు అడ్డుగా నిలుస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ-జనసేన సంబంధాలను మరింత ఉద్రిక్తతకు గురిచేస్తాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జనసేన నేతలే వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని నాదెండ్ల వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో, కూటమి సంబంధాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.