Site icon HashtagU Telugu

Nara Lokesh : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్

Nara Lokesh

Nara Lokesh

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు (contract outsourcing employees) మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జిల్లాలు, మండలాల్లోని సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గౌరవ వేతనాల సమస్యకు సంబంధించి, గత ప్రభుత్వ కాలంలో 21 రోజుల సమ్మె చేశారు. లోకేశ్ ఆ సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబరు 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించిన వేతనం చెల్లించాల్సిందిగా ఇటీవల విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ని సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిసి రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు. దీంతో ఈ వేతనాలు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులంతా నారా లోకేష్ పై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..