Site icon HashtagU Telugu

Pawan Kalyan : అసలు పవన్ భారతీయుడే కాదు – మంత్రి జోగి

Jogi Awan

Jogi Awan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh). నిన్న పవన్ కల్యం.. పెడన సభ లో వైసీపీ ఫై , జగన్ ఫై నిప్పులు చేరగడం తో ఎప్పటిలాగానే వైసీపీ మంత్రులు (YCP Ministers) మీడియా ముందుకు వచ్చి పవన్ ఫై విమర్శలు , కౌంటర్లు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల పవన్ ఫై మంత్రి జోగి ఎక్కువ ఫోకసే పెడుతూ వస్తున్నారు. నిత్యం పవన్ ఫై విమర్శలు చేస్తూ..వైసీపీ శ్రేణుల్లో ఉత్సహం నింపుతున్నాడు. అదే క్రమంలో జనసేన , టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి గురి అవుతున్నాడు.

తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి ఫైర్ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర పెడ‌న‌ (Janasena Pedana Public Meeting)లో అట్ట‌ర్ ఫ్లాప్ షోలా మిగిలిపోయింద‌ని మంత్రి జోగి ర‌మేష్ పేర్కొన్నారు. సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశాడు.. రెండు వేల మందితో దాడులు అన్నాడు.. కానీ, పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదని విమర్శించారు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని దుయ్యబట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు స్కిల్ స్కాం (Skill Scam)లో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు.. జైల్లో ఉన్న దత్త తండ్రి కోసం పవన్‌ పాకులాడుతున్నాడని మండిపడ్డారు. పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజలపై ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కల్యాణ్‌ది అని ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్ భారతీయుడో, రష్యా వాడో తెలియడం లేదు. భారతీయులు, ఆంధ్ర వాళ్ళకు పాస్ పోర్ట్ అక్కర లేదన్నారు. రష్యా వాడికి మాత్రం పాస్ పోర్ట్ కావాల్సిందేనని పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు. పవన్ ను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మబోరన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ పావలా.. పావలాలు పంచుకునే పావలాగాళ్లు మీరంతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఖర్మ పట్టింది.. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

నన్ను అండమాన్‌ జైలుకు పంపిస్తాను అని పవన్‌ అన్నాడు. పవన్, నీకో విషయం చెబుతున్నా. 2024 తర్వాత నీవు రెడీగా ఉండు. నీతో నేను రెండు సినిమాలు తీస్తాను. జానీ–ఖూనీ. గబ్బర్‌సింగ్‌–రబ్బర్‌సింగ్‌ . ఈ రెండు సినిమాలు తీస్తాను. ఎందుకంటే, ఆయన అప్పుడు సినిమాలు మాత్రమే చేసుకోవాలి కాబట్టి.. అని మంత్రి జోగి రమేశ్‌ సెటైర్ వేసాడు. మరి జోగి వ్యాఖ్యలపై జనసేన – టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also : Chiranjeevi – Satyanand : సత్యానంద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఫై చిరు ‘ప్రశంసలు ‘