జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పొత్తులపై ఆయన మాట్లాడుతూ పిచ్చోడికి మళ్లీ పెళ్లి కుదిరిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తో ములాఖత్ కు వెళ్ళి మిలాఖత్ అయ్యాక పవన్ కు లగ్గం కుదిరిందన్నారు. 5 కోట్ల మంది ప్రజల్ని అడిగితె జగన్ స్థాయి పవన్ కు చెప్తారని.. ముందు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో చెప్పాలన్నారు. సింగిల్ హ్యాండ్ తో పార్టీ స్థాపించి ,చరిత్ర సృష్టించేలా జగన్ విజయం సాధించారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. యువరాజ్యాన్ని కాంగ్రెస్ కు అమ్మేసిన పవన్ కళ్యణ్ స్థాయి ఏంటని ఆయన ప్రశ్నించారు. జనసేనను చంద్రబాబుకు అమ్మేసిన ప్యాకేజి స్టార్ కు స్థాయి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాజకీయాల్లో విలువలు ,సిద్ధాంతం ,ఆశయాలే పవన్ కళ్యాణ్ కు లేవని.. చంద్రబాబుని ,లోకేష్ ని ఒకప్పుడు తిట్టి ఇప్పడూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని కార్యకర్తలు పిచ్చివాళ్లవుతున్నారన్నారు.
సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి కూతలు కూస్తే బట్టలు ఇప్పతిసి కొడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపు తప్పి మాట్లాడితే ప్రజలే పవన్ కు గుణపాఠం చెప్తారని.. పొత్తు పెట్టుకున్న, పాలేరుగా ఉన్న మాకు సంబంధం లేదని మంత్రి జోగి రమేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మానసిక స్థితి బాగోలేదని.. ఆ విషయం పవన్ కళ్యాణ్ పెళ్ళి చేసుకుని వదిలేసినా వారికీ తెలుసన్నారు. నామరూపాలు లేకుండా చేస్తా అన్న చంద్రబాబు జైలు ఊసలు లెక్కపెడుతున్నారని.. స్కిల్ స్కాం లో లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు.