Site icon HashtagU Telugu

Current charges : క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క వ్యాఖ్యలు

Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges

Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges

Current charges : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో గృహ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోసారి ధరలు పెరిగితే ఎలా అని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తాజా ప్రకటన చేశారు. కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు” అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై తప్పుడు వార్తలు వ్యాపించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చేసిన దుష్ప్రచారమేనని మంత్రి మండిపడ్డారు.

Read Also: International Nurses Day : వైద్య‌రంగంలో న‌ర్సుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, సరసమైన ధరలో విద్యుత్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో పునరుత్పత్తి విద్యుత్ (రిన్యూవబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. “పీక్ అవర్స్‌లో కూడా కేవలం రూ.4.60 కే విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది ప్రజలకు తక్కువ ధరకే నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడానికి తీసుకున్న ముందడుగు” అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే విశ్వసించాలంటూ మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రంగంలో ఆధునీకరణ, పారదర్శకత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చేలా మంత్రి వ్యాఖ్యలు ఉండగా, కరెంట్ ఛార్జీల పెంపు వార్తలపై ఒక స్థాయిలో క్లారిటీ వచ్చినట్లైంది.

Read Also: AP Govt : జూన్ లో ఏపీ ప్రజలకు డబ్బులే డబ్బులు..ఎలా అనుకుంటున్నారా..?