Site icon HashtagU Telugu

Amarnath Reaction: తెలంగాణ బిడ్ దాఖలు పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్..

Minister Amarnath Reaction On Telangana Bid Filing..

Minister Amarnath Reaction On Telangana Bid Filing..

Amarnath Reaction : విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజకీయ రగడ మళ్ళీ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించేందుకు సిద్ధమైన వేళా తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనేందుకు సిద్ధం కావడంతో రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే మొదటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరించొద్దు అనేది బీఆర్ఎస్ స్టాండ్. కానీ ఇప్పుడు బిడ్డింగ్ కు వెళ్లేందుకు సిద్దమవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్ గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ కు సిద్ధం అయిన వేళా మంత్రి అమర్నాథ్ (Amarnath) లాజికల్ కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకం. ఇదే మా స్టాండ్. ఇన్నాళ్లు తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరొంచొద్దు అంటూ మాట్లాడింది. అది కూడా వాళ్ళ స్టాండ్ గానే చెప్పుకుంది. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను కొనేందుకు ఎలా సిద్దపడింది. బిడ్డింగ్ కి ఎలా వెళుతుంది అని ప్రశ్నించారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యాలని అనుకుంటున్నదా అని ప్రశ్నించారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో అనేక స్పెక్యూలేషన్స్ వస్తున్నాయి కానీ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి అధికారిక సమాచారం లేదన్నారు మంత్రి. అయితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నిజానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కన్ఫర్మ్. కేంద్రం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అమ్మడం ఖాయమైతే దాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేసి కార్మికులకు అండగా నిలవాలనేది కేసీఆర్ భావిస్తున్నట్టు కొందరు అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బీడ్ దాఖలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. అందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ వెళ్లి అధ్యాయనం చెయ్యాలని సూచించారు. మొత్తంగా స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటు పరం కాకుండా కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Also Read:  Jagan Plan: మా నమ్మకం నువ్వే జగనన్నా.. ప్రోగ్రాం ఫోకస్