Mind Game in AP : బోగ‌స్ స‌ర్వేల హ‌వా

బోగ‌స్ సర్వేల హోరు (Mind Game in AP)  ఏపీ మీద ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అక్క‌డి స‌మ‌స్య‌ల మీద చ‌ర్చ జ‌ర‌గ‌కుండా మైండ్ గేమ్ ఆడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 01:53 PM IST

బోగ‌స్ సర్వేల హోరు (Mind Game in AP)  ఏపీ మీద ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అక్క‌డి స‌మ‌స్య‌లు, ప‌రిష్కారాల మీద చ‌ర్చ జ‌ర‌గ‌కుండా మైండ్ గేమ్ ఆడుతున్నాయి. కేవ‌లం వారం వ్య‌వ‌ధిలోనే పూర్తి భిన్న‌మైన స‌ర్వేలు బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఐ ప్యాక్ సంస్థ స‌ర్వే లీక్ అయిందంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీలు వైసీపీకి కేవ‌లం మూడు ఎంపీ స్థానాలు మాత్ర‌మే గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని న్యూస్ వైర‌ల్ చేస్తున్నాయి. కేవ‌లం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల‌కు ఆ పార్టీ ప‌రిమితం అవుతుంద‌ని ఆ స‌ర్వే సారాంశం.

బోగ‌స్ సర్వేల హోరు (Mind Game in AP) 

వాస్త‌వంగా ఐ ప్యాక్ వైసీపీకి ప‌నిచేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆ సంస్థ ప్ర‌శాంత్ కిషోర్ ఆధ్వ‌ర్యంలో వైసీపీకి అండ‌గా నిలిచింది. సామాజిక‌వ‌ర్గాలు, ప్రాంతాల వారీగా ఆ స‌ర్వే సంస్థ ఏపీ స‌మాజం మీద దాడి చేసింది. అంతేకాదు, కోడిక‌త్తి నుంచి బాబాయ్ మ‌ర్డ‌ర్ వ‌ర‌కు సానుభూతిని క్రియేట్ చేసేలా ఐ ప్యాక్ మ‌లిచింది. ఫ‌లితంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకునేలా చేసింది. ఆ త‌రువాత ప్రశాంత్ కిషోర్ బీహార్ వెళ్లారు. కానీ, ఆయ‌న టీమ్ మాత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప‌నిచేస్తోంది. ప‌రిపాల‌న మీద ప్ర‌జాభిప్రాయాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేల రూపంలో తెలియ‌చేస్తోంది. వాటిని బేస్ చేసుకుని (Mind Game in AP)  ఇటీవ‌ల రెండుసార్లు రాజ‌కీయ రివ్యూల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెట్టారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల గ్రాఫ్ ల మీద 

తొలి రివ్యూ మీటింగ్ లో స‌గం మంది గ్రాఫ్ బాగాలేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల‌కు వార్నింగ్ ఇచ్చారు. మూడు నెల‌లు టైమ్ ఇస్తున్నానంటూ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ ప్ర‌భుత్వం అంటూ ఒక ప్రోగ్రామ్ ను పెట్టారు. దాని ద్వారా గ్రాఫ్ పెంచుకోవాల‌ని ఆదేశించారు. స్పందించిన కొంద‌రు జ‌నం మ‌ధ్య‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా కొంద‌రు ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను ప్ర‌జలు వెంబ‌డించారు. కొన్ని చోట్ల నిల‌దీస్తూ ఘెరావ్ చేసిన సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. కొంద‌రు మొండిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. మ‌రికొంద‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డ్డారు. మ‌రో రివ్యూ మీటింగ్ పెట్టిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల గ్రాఫ్ ల మీద (Mind Game in AP)  అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. షీట్ల‌ను ర‌హ‌స్యంగా ఎవరికి వాళ్ల‌కే పంపించారు.

ఐ ప్యాక్ స‌ర్వే సారాంశమ‌ని ఒక న్యూస్ వైర‌ల్ (Mind Game in AP) 

గ్రాఫ్ బాగ‌లేని వాళ్ల‌కు టిక్కెట్ ఇవ్వలేమ‌ని అప్ప‌ట్లోనే తేల్చారు. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను కొంద‌రు చూసుకున్నారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టికీ పార్టీలో కొన‌సాగుతున్నారు. కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రుల‌కు సైతం ఈసారి టిక్కెట్ ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం ఐ ప్యాక్ స‌ర్వే సారాంశమ‌ని తెలుస్తోంది. దానితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల ద్వారా స‌ర్వేల‌ను కూడా చేయించార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. ఆ మూడు స‌ర్వేల‌ను క్రోడీక‌రించిన డేటా లీక‌యింద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల సోష‌ల్ వారియ‌ర్స్ (Mind Game in AP)  ఒక న్యూస్ ను వైర‌ల్ చేస్తున్నారు. దాని ప్ర‌కారం మూడు ఎంపీలు, 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది.

టైమ్స్ నౌ చేసిన స‌ర్వే భోగ‌స్ గా ప్ర‌త్య‌ర్థి పార్టీలు

ఇక టైమ్స్ నౌ అనే జాతీయ సంస్థ ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో వైసీపీకి 25 ఎంపీ స్థానాల్లో 24 గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. అంతేకాదు, ఎమ్మెల్యేలు 130 నుంచి 140 వ‌ర‌కు గెలుచుకుంటుంద‌ని తేల్చింది. ఇదే సంస్థ మూడు నెల‌ల క్రితం విడుద‌ల చేసిన స‌ర్వేల్లో 25 మంది ఎంపీల‌కు 25 మందిని వైసీపీ గెలుచుకుంటుంద‌ని చెప్పింది. అలాగే, ఎమ్మెల్యేలు 160 మందిని వైసీపీ గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. ఆ స‌ర్వేను చూసిన ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆ సంస్థ మీద నిఘా పెట్టాయి. వైసీపీ నుంచి భారీగా ముడుపులు తీసుకుని విడుద‌ల చేసిన (Mind Game in AP)  స‌ర్వేగా తేల్చేశాయి. అంతేకాదు, స‌ర్వే చేసిన హెడ్ లు, చేతులు మారిన ముడుపుల భాగోతం బ‌య‌ట పెట్ట‌డంతో టైమ్స్ నౌ చేసిన స‌ర్వే భోగ‌స్ గా ప్ర‌త్య‌ర్థి పార్టీలు తేల్చేశారు.

Also Read : Atmasakshi Survey: ఆత్మసాక్షి సంచలన సర్వే, సగం కాబినెట్ ఓటమి, అధికారంలోకి టీడీపీ

తాజాగా ఐ ప్యాక్ స‌ర్వే లీక్ అంటూ వైర‌ల్ అవుతోన్న న్యూస్ మీద ప‌లు టీవీ ఛాన‌ళ్లు డిబేట్ పెట్టాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆ న్యూస్ ఉంద‌ని విప‌క్షాల వాద‌న‌. కానీ, అధికార‌ప‌క్షం మాత్రం స‌ర్వే లీక్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విప‌క్షాలు దుష్ప్ర‌చారానికి దిగాయ‌ని భావిస్తోంది. ఇలా, ప్ర‌ధాన పార్టీలు స‌ర్వేల‌తో ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విశాఖ రైల్వే, అమ‌రావ‌తి రాజ‌ధాని, జ‌గ‌న్ స‌ర్కార్ భూ భాగోతాలు, అవినీతి, అక్ర‌మాల పై సీరియ‌స్ చ‌ర్చ జ‌ర‌గ‌డంలేదు. ఫ‌లితంగా ఏపీ స‌మాజానికి అపార న‌ష్టం బోగ‌స్ స‌ర్వేల (Mind Game in AP)  ద్వారా క‌లుగుతోంది.

Also Read : Election Survey : మ‌ళ్లీ భార‌త్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోట‌ర్ స‌ర్వే