Chandrababu : మధ్యతరగతి ప్రజలంతా బాబునే కోరుకుంటున్నారు..ఇదే సాక్ష్యం

రాజమండ్రి నుండి ఉండవల్లి నివాసం చేరుకునే అంత వరకు బాబు కు రోడ్ల వెంట ప్రజలు , అభిమానులు , టీడీపీ - జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున అభివాదం చేస్తూ , హారతులు ఇస్తూ బాబు కు జై జైలు పలికారు

Published By: HashtagU Telugu Desk
TDP

AP CID files fresh case against Chandrababu

చంద్రబాబు (Chandrababu )..ఇది పేరు కాదు ఓ బ్రాండ్..ఓ విజన్. కోట్లాదిమందికి ఆదర్శం. అలాంటి మహా నేతను అక్రమ కేసులో అరెస్ట్ చేయడం..52 రోజులపాటు జైలు లో ఉంచడం టీడీపీ శ్రేణులనే కాదు యావత్ తెలుగు ప్రజలను కలవరపెట్టింది. చంద్రబాబు అరెస్ట్ అనే మాటను తట్టుకోలేక పదుల సంఖ్యలో గుండెలు ఆగిపోయాయి. మా బాబు రావాలి..మా బాబు క్షేమంగా ఉండాలని కోట్లాదిమంది ప్రజలు ఆలయాల్లో , చర్చిల్లో , మసీద్ లలో పూజలు , ప్రార్థనలు , ప్రేయర్ చేసారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారా..? అని రాజకీయ పార్టీ నేతలు , బిజినెస్ ప్రముఖులు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ..ఆయనకు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా దగ్గరి నుండి కూడా ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ట్రై చేస్తూ వస్తున్నప్పటికీ..వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్య గా చంద్రబాబు ఫై అనేక కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసింది. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయనకు బెయిల్ మంజుల చేయాలనీ హైకోర్టు ను కోరారు. దీంతో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. బెయిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు (Chandrababu) కుటుంబ సబ్యులకు, టీడీపీ శ్రేణులకు , అభిమానులకు కోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 28న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబుకు బెయిల్ (Chandrababu Bail) మంజూరు కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిసాయి. బాణా సంచా కాలుస్తూ వారి ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే సమయంలో వేలాదిమంది జైలు వద్దకు చేరుకొని చంద్రబాబు కు స్వాగతం పలికారు. రాజమండ్రి నుండి ఉండవల్లి నివాసం చేరుకునే అంత వరకు బాబు కు రోడ్ల వెంట ప్రజలు , అభిమానులు , టీడీపీ – జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున అభివాదం చేస్తూ , హారతులు ఇస్తూ బాబు కు జై జైలు పలికారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో మధ్యతరగతి వారే ఉండడం విశేషం. ఏ నాయకుడి గెలుపుకైనా కీలక పాత్ర పోషించేది మధ్యతరగతి వర్గ ప్రజలే. వారికీ ఏ నాయకుడు నచ్చుతాడో ఆయనకే మద్దతుగా ఉంటారు. గత ఎన్నికల సమయంలో వైస్ రాజశేఖర్ రెడ్డి ఫై ఉన్న అభిమానం తో ఆయన కొడుకు జగన్ కు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత వారందరికీ అర్థమైంది మీము ఎంత తప్పు చేశామా అని..రాజశేఖర్ బిడ్డ ఏదో చేస్తాడని..ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని అంత భావించారు. కానీ రాష్ట్రాన్ని ఆగం చేయడమే కాదు మధ్యతరగతి వారిని అప్పుల్లో పడేసాడు.

మధ్యతరగతి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఉన్నదాట్లో సరిపెట్టుకుంటారు. పెద్ద పెద్ద కోర్కెలు ఉండవు..తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి..వారి ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి..మంచి వరుడు , వరునికి ఇచ్చి పెళ్లి చేయాలి..ఇలా చిన్న చిన్న కోర్కెలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడమే వారి లక్ష్యంగా బ్రతుకుతారు. అలాంటి మధ్యతరతి ప్రజలను జగన్ రోడ్డున పడేసారు. చేసేందుకు పనులులేక..అప్పులు కట్టలేక..నానా తిప్పలు పడుతున్నారు. మళ్లీ చంద్రబాబు వస్తేనే తమ భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగాఖండించడమే కాకుండా ఆయన క్షేమంగా బయటకు రావాలని పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి సంఘీభావం తెలిపారు.

ఇక చంద్రబాబు విడుదల అయ్యారని తెలిసి సంబరాలు చేసుకున్నారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున అర్ధరాత్రైనా లెక్క చేయకుండా రోడ్ల మీదకు వచ్చి చూసారు. బాబు మీరు బాగుండాలి..మా భవిష్యత్ బాగుండాలంటే మీరే రావాలయ్యా అంటూ వారంతా కోరుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలు బాబు కే సపోర్ట్ అని స్పష్టంగా తెలుస్తుంది.

Read Also : CBN : చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు.. ఏ1గా మాజీ మంత్రి పీత‌ల‌, ఏ2గా చంద్ర‌బాబు

  Last Updated: 03 Nov 2023, 12:41 PM IST