Rain Alert Today : ఇవాళ ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు తెలిపారు. ఈనెల 17 వరకు మృత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాడేరు ఏజెన్సీలో వానల వల్ల (Rain Alert Today) ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Rain Alert Today : ఏపీలోని ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్షసూచన
