Mega Parent Teacher Meet: డిసెంబర్ 7న ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్ (Mega Parent Teacher Meet) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మధ్యాహ్న భోజనం, వాటర్, పుస్తకాలు ఎలా అనే అంశాలపై సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్ 7న 44303 స్కూల్స్‌లో టీచర్స్ పేరెంట్స్ మీట్ పెడుతున్నట్లు అధికారులు వివరించారు. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో కోటి 20 లక్షల మంది పాల్గొననున్నట్లు సమాచారం.
పిల్లలు చేత ఇన్విటేషన్ తయారు చేయించి తల్లిదండ్రులను సమావేశానికి పిలుస్తున్నామని, టీచర్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అధికారులు అంటున్నారు. హోలిస్టిక్ ప్రోగ్రాస్ కార్డు ఇస్తున్నామని, విద్యార్థుల గురించి అన్ని విషయాలు ఈ ప్రోగ్రాస్ కార్డులో ఉంటాయన్నారు. సైబర్ ఆవేర్న్స్, ముగ్గుల పోటీలు వంటివి తల్లి దండ్రులకు పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్స్‌లో హెల్త్ కార్డులు ఇవ్వటమే కాకుండా.. 900 స్కూల్స్ లో స్క్రీనింగ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: Kakinada Port : జగన్ మాఫియా పై..ప్రజా ఉద్యమం పెల్లుబకాల్సిన అవసరం
అంతేకాకుండా స్కూల్స్‌కి స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నారు. మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. 0 నుండి 5 వరకు రేటింగ్ ఇస్తారు. డోనర్స్ ని కూడా పిలుస్తున్నామన్నారు. మీటింగ్ లో తల్లిదండ్రుల నుండి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదని.. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వస్తారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుండి వార్డు సభ్యుడి వరకు సమావేశానికి హాజరు కావాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి బాపట్లలో పాల్గొంటారని, విద్యాశాఖ మంత్రి కూడా అక్కడే పాల్గొంటారని తెలుస్తోంది. పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు. స్టార్ రేటింగ్ మీటింగ్ లో ఇస్తామని, ఐటీ ప్లాట్ ఫామ్ క్రియట్ చేస్తున్నామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక వసతులు బాగున్నాయని, రాధాకృష్ణ రిపోర్ట్ రాగానే పని చేస్తామని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిధర్ తెలిపారు.