జగన్ ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్ లో భారీగా హోటల్ రూమ్స్ బుకింగ్ ..

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 11:27 AM IST

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో చెప్పాల్సిన పనిలేదు. గెలుపు ఫై అధికార పార్టీ , కూటమి పార్టీలు ధీమాగా ఉన్నారు. ఎవరికీ వారు మీమంటే మీము గెలుస్తాం అంటూ చెపుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు మరింత స్పీడ్ గా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుండడం అందరిలో ఆశ్చర్యం , షాక్ కు గురి చేస్తున్నాయి. జగన్ జూన్ 09 న వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ నేతలు చెపుతూ వస్తున్నారు. ఇటు టీడిపి శ్రేణులు అమరావతి లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు వైసీపీ నేతలు ఏకంగా వైజాగ్ లో పెద్ద ఎత్తున హోటల్ రూమ్స్ బుక్ చేస్తుండడం కాస్త ఆశ్చర్యం గురి చేస్తుంది. అధికార పార్టీ లో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య అధికారులు విశాఖ నగరంలో చాల బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం అక్కడే ఉంటుందని చెబుతున్న వేళ ఈ ఇద్దరు అధికారుల పర్యటన పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. విశాఖలో లో జూన్-9 నాటికి ముందస్తుగా హోటల్ రూమ్ లు కూడా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో రూమ్ లు బ్లాక్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారట స్థానిక నేతలు. రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఫిక్స్ అవుతుందని అంటున్నారు. అయితే, ఆంధ్రా యూనివర్సిటీ గ్రైండ్స్ లో కార్యక్రమం ఉంటుందని విశాఖ వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఇదే క్రమంలో టీడీపీ నేతలు సైతం వైసీపీ గెలిచే ఛాన్స్ లేదని..ఇదంతా జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ అని అంటున్నారు. మరి జూన్ 04 న ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : AP : టీడీపీ పార్టీకి నాలుగే గతి – విజయసాయి రెడ్డి