Pawan : బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ నీచ రాజకీయం చేస్తున్నాడు – మావోయిస్టు గణేష్

పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అని ఊదరగొట్టాడు. కానీ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నాడని

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 03:44 PM IST

సినిమాల్లో ఎలాంటి విమర్శ..ఆరోపణ ఎదురుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి ఊరు పేరు తెలియని వారితో కూడా మాటలు అనిపించుకుంటున్నాడు..ఈ మాటలకు అభిమానులు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. కానీ రాజకీయాలు అంటే అంతే..ఒన్స్ దిగామో మాటలు అనిపించుకోవడం..మాటలు అనడం చేయాలి తప్పదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే.

We’re now on WhatsApp. Click to Join.

జనసేన పార్టీ స్థాపించి 11 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు అసెంబ్లీ లోకి వెళ్ళలేదు. కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్యే గా గెలిచి అధ్యక్షా అనాలని తహతహలాడుతున్నాడు. ఇదే క్రమంలో వైసీపీ గద్దె దించాలని కసిగా ఉన్న పవన్..బిజెపి , టిడిపితో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగబోతున్నాడు. అదే ఆయన్ను మరింత విమర్శలకు దారి తీస్తుంది. ఒంటరిగా వెళ్తే బాగుండని, అనవసరంగా పొత్తు పెట్టుకున్నాడని , దీనివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా మావోయిస్టు కీలక నేత గణేష్(Maoist leader Ganesh ) ఏపీ రాజకీయ పార్టీల విధానాలపై స్పందించారు. ముఖ్యంగా జనసేన పార్టీపై(Janasena party) తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అని ఊదరగొట్టాడు. కానీ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌కు(Pavan kalyan) స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువని ఆరోపించారు. సినీ గ్లామర్, కాపు కులస్తుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మీడియాకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

Read Also : Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్..