Ganji Chiranjeevi : గంజి చిరంజీవికి కీలక పదవి అప్పగించిన జగన్

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 08:22 PM IST

మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జి (Mangalagiri YCP New Incharge)గా గంజి చిరంజీవి (Ganji Chiranjeevi)ని నియమిస్తూ పార్టీ అధినేత , సీఎం జగన్ (CM Jagan) ప్రకటన చేసారు. ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రామకృష్ణ తెలిపారు. దీంతో జగన్.. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించాలని ఆదేశాలు జారీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో చిరంజీవి టీడీపీలో పని చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఆ స్థానంలో టీడీపీ నుంచి నారా లోకేశ్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా టీడీపీలోనే కొనసాగారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు గంజి చిరంజీవి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడంతో పార్టీ ఇంచార్జిగా గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించారు. ఇక రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని బరిలో దించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీ కి , పదవికి రాజీనామా చేసిన ఆళ్ల..నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూడాలి.

Read Also : Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా..!