Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన మందకృష్ణ మాదిగ

Pawan Kalyan : ఏదైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తీసుకురావాలి గానీ, బహిరంగవేదికలో ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Madakrishna Madiga

Madakrishna Madiga

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిన్న పిఠాపురంలో హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల పోలీస్ శాఖ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవి (Home మినిస్టర్ Post)ని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిజాయతీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన ఆయన, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మందకృష్ణ మాదిగ (Madhakrishna Madiga) తప్పుబట్టారు.

పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్నారు. ఏదైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తీసుకురావాలి గానీ, బహిరంగవేదికలో ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పవన్ ఇలా కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. హోం మంత్రిని విమర్శించడం అంటే, సీఎం ను విమర్శించినట్లేనని, సామాజిక న్యాయమన్న పవన్ కళ్యాణ్ మాదిగలకు ఏవిధంగా న్యాయం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. పవన్ చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని మందకృష్ణ అన్నారు.

Read Also : AP Govt : క్యాన్స‌ర్, గుండె పోటు మ‌హ‌మ్మారిల‌కు క‌ళ్లెం వేయ‌డానికి సిద్ధ‌మైన ఏపీ సర్కార్

  Last Updated: 05 Nov 2024, 08:01 PM IST