Site icon HashtagU Telugu

Bus Seat : బస్సు లో సీటు..ఏకంగా రూ. 11 లక్షలు పోయేలా చేసింది..

Bus Seat

Bus Seat

ఇటీవల ఏది సాధించిన సాధించకపోయినా బస్సు లో సీటు సాధించాలని ప్రతి ప్రయాణికుడి అనుకుంటున్నారు..ఫ్రీ బస్సు ఎఫెక్ట్ కొంత ఉండగా..బస్సు ల కొరత కారణంగా కొంత మంది ఇలా ఆలోచిస్తున్నారు. బస్టాండ్ లోకి బస్సు రావడమే ఆలస్యం ఒక్కసారిగా సీట్ల కోసం ఎగబడుతున్నారు. సీటులో ముందు నేను ఖర్చీఫ్ వేసానంటే..నేను వేశానంటూ గొడవలు పడడం..కొట్టుకోవడం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సీటు కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్న ఘటన నరసాపురం బస్టాండులో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

గుంటూరులోని ఓ బంగారు వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేసే సింగ్ అనే వ్యక్తి సోమవారం నరసాపురం వచ్చారు. నరసాపురంలోని బంగారు షాపు యజమానుల వద్ద నగల తయారీకి సంబంధించిన ఆర్డర్లు తీసుకొని , అలాగే వారి నుంచి రావాల్సిన డబ్బులు వసూలు చేసుకుని ఓ బ్యాగులో పెట్టుకొని నరసాపురం బస్టాండ్ కు వచ్చాడు. భీమవరం వెళ్లేందుకు ఎదురుచూస్తుండగా.. బస్సు కనిపించింది. అప్పుడే స్టాప్ లోకి రావటంతో బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. దీంతో బస్సులో సీటు కోసం ఆశపడిన సింగ్.. ఓ సీటు కనిపించగానే కిటీకీలో నుంచి తన చేతిలో ఉన్న బ్యాగును సీట్లో వేసాడు. తీరిగ్గా బస్సు ఎక్కి సీటు వద్దకు వెళ్లి చూడగా..సీటులో వేసిన బ్యాగ్ కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ బస్సు మొత్తం వెతికాడు..ఎక్కడ బ్యాగ్ కనిపించలేదు.

బ్యాగులో రూ.11 లక్షల నగదు, బంగారం ఉన్నట్లు సింగ్ చెప్పుకొని ఏడుస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బస్టాండ్ పరిసరాల్లో గాలించి, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెర్లాలో ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడం తో అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Stress: ఒత్తిడికి ప్ర‌ధాన కారాణాలు ఇవే.. ఆ ల‌క్ష‌ణాలతోనే!