Site icon HashtagU Telugu

Murder : తిరుమ‌ల‌లో దారుణం.. శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చి భార్య, బావమరిదిని హత్య చేసిన‌ వ్య‌క్తి

Murder

Murder

తిరుమలలో దారుణం జ‌రిగింది. శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తున్న తన భార్య, బావమరిదిని హ‌త్య చేశాడు. నిందితుడిని నాందేడ్ జిల్లాకు చెందిన నర్వాడి యువరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన తన భార్య మనీషా (25), ఆరేళ్ల నాలుగేళ్ల ఇద్దరు పిల్లలతో పాటు తన బావ ఎన్‌. హర్షవర్ధన్‌ (27)తో కలిసి గురువారం తిరుపతికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం కోసం వచ్చిన కుటుంబ స‌భ్యులు కపిల తీర్థం సమీపంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో బ‌స చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో యువరాజ్ తన భార్య, బావమరిదిని కత్తితో పొడిచాడని అలిపిరి డివిజన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి.అబ్బన్న తెలిపారు. నిందితుడు బట్టలపై రక్తపు మరకలతో హోటల్ నుంచి బయటకు వెళ్లిన హోటల్ సిబ్బంది చూశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అబ్బన్న, పోలీసు అధికారుల బృందం హోటల్‌కు చేరుకున్నారు. సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని ఆధారాలు సేకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read:  YSRCP : ఏపీకి మేలు జరగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి – మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్‌

Exit mobile version