Mahanadu : `మ‌హానాడు`పై YCP లుక్ ,రాజ‌మండ్రిలో CID హ‌ల్ చ‌ల్

మ‌హానాడును(Mahanadu) క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లకు దిశానిర్దేశం చేయ‌డానికి సిద్ద‌మైయింది

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 02:28 PM IST

మ‌హానాడును(Mahanadu) క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లకు దిశానిర్దేశం చేయ‌డానికి ఆ వేదిక‌ను ఈసారి ఉప‌యోగించుకోవ‌డానికి సిద్ద‌మైయింది. మ‌హానాడు ఇచ్చే నూత‌నోత్సాహంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చంద్ర‌బాబు వ్యూహం ర‌చిస్తున్నారు. అందుకే, ఈసారి మ‌హానాడును విజ‌య‌వంతం చేసే ప్రధాన బాధ్య‌త‌ను స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీ (Adireddy Bhavani) కుటుంబానికి అప్ప‌గించింది. ఆ బిజీలో  ఆదిరెడ్డి భ‌వానీ భ‌ర్త శ్రీనివాస్‌, ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావు త‌దిత‌రులు ఉన్నారు. ఆ విషయాన్ని గ‌మ‌నించిన వైసీపీ ఆ కుటుంబం మీద ఏపీ సీఐడీ ను ప్ర‌యోగించింద‌ని టీడీపీ ఆరోపిస్తోంది.

మ‌హానాడును క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో(Mahanadu) 

వాస్త‌వంగా ఏపీ సీఐడీ మునుపెన్న‌డూ లేనివిధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అయిన త‌రువాత సీఐడీకి కోర‌లు పెట్టారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి దాన్ని ఉప‌యోగిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అందుకు బ‌లం చేకూరేలా మాజీ మంత్రి అచ్చంనాయుడు(Achamnaidu) అరెస్ట్ , విచార‌ణ తీరును చూశాం. అలాగే మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌(Raveendra), ధూళ్లి పాళ్ల న‌రేంద్ర‌, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అయ‌న్న‌పాత్రుడు (Ayyannapatrudu) త‌దిత‌రుల మీద కేసులు పెట్ట‌డం, వాళ్ల‌ను విచారించ‌డాన్ని కూడా గుర్తు చేసుకోవ‌చ్చు. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు విష‌యంలో ఏపీ సీఐడీ అధికారులు ఎలా వ్య‌వ‌హ‌రించారో అంద‌రికీ తెలిసిందే. తాజాగా రామోజీరావు, శైలిజ మీద మార్గ‌ద‌ర్శి విష‌యంలో విచార‌ణ చేసిన ఏపీ సీఐడీ ఇప్పుడు కింజ‌ర‌పు ఎర్రంనాయుడు(Adireddy Bhavani) కుటుంబం మీద క‌న్నేసింది.

ఏపీ సీఐడీకి  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోర‌లు

మాజీ కేంద్ర మంత్రి కింజ‌ర‌పు ఎర్రంనాయుడు (Yarramnaidu) కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎంపీ. ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా ఆయ‌న‌కు ఉన్న క్రేజ్ అంద‌రికీ తెలిసిందే. ఇక రామ్మోహ‌న్ నాయుడు(Rammohan naidu) సోద‌రి ఆదిరెడ్డి భ‌వానీ. ప్ర‌స్తుతం ఆమె రాజ‌మండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్సీ. ఇక ఏపీ టీడీపీ అధ్య‌క్షునిగా కింజ‌ర‌పు అచ్చెంనాయుడు(achemnaidu) ఉన్నారు. ఆ కుటుంబానికి ఉత్త‌రాంధ్ర నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబాన్ని ఆక‌ర్షించ‌డానికి ప‌లుమార్లు వైసీపీ ప్ర‌య‌త్నం చేసింది. సామ‌దాన‌దండోపాయాల‌ను ప్ర‌యోగించింద‌ని రాజ‌కీయాల‌ను ద‌గ్గ‌ర నుంచి చూసే వాళ్ల‌కు తెలుసు. అయిన‌ప్ప‌టికీ తొలి నుంచి టీడీపీతో ఉన్న ఆ కుటుంబం ఏ మాత్రం ఛాన్సా వైసీపీకి ఇవ్వ‌లేదు. అందుకే, ఇప్పుడు ఏపీ సీఐడీని(AP CID) ప్ర‌యోగిస్తుంద‌ని టీడీపీ చెబుతోంది.

కింజ‌ర‌పు కుటుంబాన్ని భ‌య‌కంపితుల‌ను చేయ‌డానికి

రాజ‌మండ్రి కేంద్రంగా చేసుకుని జ‌గ‌జ్జ‌న‌నీ అనే చిట్ ఫండ్ కంపెనీ ఆదిరెడ్డి అప్పారావు(Apparao), శ్రీనివాస్, జోత్స్న డైరెక్ట‌ర్లుగా ఉంది. ఆ కంపెనీ ఫ్రాండ్ చేసింద‌ని ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు. కానీ, కాకినాడ‌కు చెందిన అసిస్టెంట్ రిజిస్ట‌ర్ ఆఫ్ చిట్స్ వ‌ర‌ప్ర‌సాద్ (varaprasad)ఫిర్యాదు చేశార‌ట‌. దాన్ని బేస్ చేసుకుని ఆదిరెడ్డి భ‌వానీ కుటుంబీకుల‌పై ఏపీ సీఐడీ ఒక ర‌కంగా దండ‌యాత్ర చేసింద‌ని చెప్పాలి. ఎందుకంటే, ఆదివారం వేకువ‌జామున 5 గంట‌ల‌కు ఆదిరెడ్డి భ‌వానీ (Adireddy Bhavani)ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారులు అప్పారావు, శ్రీనివాస్ ల‌ను అరెస్ట్ చేశారు. ఎందుకు? ఏమిటి? అనేది కుటుంబీకుల‌కు తెలియ‌దు. దీంతో ఒక్క‌సారిగా వాళ్లు నివ్వెర‌పోయారు. సుమారు 17 గంట‌ల పాటు విచారించిన త‌రువాత వాళ్ల‌ను అరెస్ట్ చేసిన రిమాండ్ కు పంపారు. ఇదంతా కింజ‌ర‌పు కుటుంబాన్ని భ‌య‌కంపితుల‌ను చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన ప‌న్నాగ‌మంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

Also Read : Operation Balineni: CBN, PK భేటీ వెనుక ఆపరేషన్ ‘బాలినేని’..?

తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి భ‌వానీ (Adireddy Bhavani)కుటుంబీకుల‌కు ధైర్యం చెబుతోంది. సాక్షాత్తు అధినేత చంద్ర‌బాబు నేరుగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండ‌గా కింజ‌ర‌పు కుటుంబానికి నిలిచింది. సీఐడీ మాత్రం ఏదో ఒక ర‌కంగా ఇబ్బందులు పెట్టాల‌ని చూస్తోంద‌ని భ‌వానీ ఆరోపిస్తున్నారు. ఇదంతా కేవలం మ‌హానాడు(Mahanadu) విజ‌య‌వంతం కాకుండా భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను వైసీపీ క్రియేట్ చేస్తుంద‌ని టీడీపీ చెబుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈనెల 27, 28న జ‌రిగే మ‌హానాడు విజ‌య‌వంతాన్ని టీడీపీ ఛాలెంజ్ గా తీసుకుంది.

Also Read : TDP : రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి – టీడీపీ అధినేత చంద్ర‌బాబు