ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయాన్ని సాధించినా, తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (CHandrababu) అప్పటికే 2029 ఎన్నికల దృష్టితో వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు. ఇదే సందర్భంలో వైసీపీ బలంగా ఉన్న ప్రాంతంగా భావించే కడపలో మహానాడు (Mahanadu) నిర్వహించడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రజల ఆగ్రహానికి లోనైంది. ప్రజలు ఎప్పుడైనా నిర్ణయం మార్చగలరన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు, ఆ పార్టీకి తిరిగి అవకాశమివ్వకుండా ముందుగానే రాజకీయంగా నిఘా పెంచారు.
Telangana : మళ్లీ కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!
మహానాడు సభల రెండో రోజున ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసే కార్యక్రమాలు నిర్వహించారు. కడప పబ్బాపురం లేఅవుట్‌లో జరిగిన సభలో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, ఈ మహానాడులో టీడీపీ ఎన్టీఆర్ గొంతును AI టెక్నాలజీతో పునర్నిర్మించి ఒక డిజిటల్ వీడియోలో ప్రజలకు సందేశం పంపించడమూ పెద్ద ఆకర్షణగా మారింది. ఈ వీడియోలో ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు ఆహ్వానం పలికినట్లుగా చూపించి, టీడీపీ వారసత్వాన్ని మరింత బలోపేతం చేశారు.
మూడు రోజులుగా జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో యువత, మహిళలు, రైతులు, తెలుగు గ్లోబల్ గుర్తింపు వంటి అంశాలపై ఆరు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎన్టీఆర్ చూపిన దారిలోనే టీడీపీ నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ మహానాడు ద్వారా కడపలో టీడీపీ తన సత్తా చాటడమే కాకుండా, వైసీపీని బలహీన పరచే ప్రయత్నంలో దూసుకుపోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 ఎన్నికల దృష్ట్యా టీడీపీ ఇప్పటికే మౌలికంగా వ్యూహాలను అమలు చేస్తున్న దశలో ఉంది. ఇదంతా చూసి జగన్ అండ్ వైసీపీ బ్యాచ్ లో మంట పుడుతుందని అర్ధం అవుతుంది.