తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో మహబూబాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్(Jagan)కు ఎదురైన వ్యతిరేకతను మరువలేం. సమైక్యాంధ్ర నినాదంతో వచ్చిన జగన్‌ను తెలంగాణ ఉద్యమకారులు రైలు(Train)పైనే అడ్డుకొని తిరస్కరించారు. ఇప్పుడు అటువంటి సీన్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం(Ananthapuam) జిల్లాలో రిపీట్ కాబోతుందా అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి, వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతితో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం జగన్ పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పరిటాల సునీత ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. హెలికాప్టర్ దిగకుండా చేస్తామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.
Brain Vs Politics : రాజకీయ ఆలోచనలకు బ్రెయిన్‌తో లింక్.. ఆసక్తికర వివరాలు
తమకు చంద్రబాబు, పరిటాల రవి (Paritala Ravi)లాంటి నాయకుల బ్లడ్ ఉందని, జగన్‌ను ఆపగల శక్తి తమకు ఉందని చెప్పారు. పులివెందుల ఘటనను గుర్తుచేస్తూ, రవిని అడ్డుకున్నట్లే ఇప్పుడు జగన్‌ను అడ్డుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. గత అవమానాలకు బదులు తీర్చుకుంటామని ఆమె వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు సునీత పిలుపుతో రెడీగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం జరగబోయే ఈ పర్యటనకు పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది.
అయితే ఈ ఉద్రిక్త వాతావరణంలో వైసీపీ ప్లాన్ ఏమిటి? అని కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. సునీత సంచలన వ్యాఖ్యల మధ్య, జగన్‌ను అడ్డుకోవడం వెనుక వైసీపీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇది జగన్‌కు ఓ రాజకీయ మిలేజ్ అందించే స్కెచ్ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగొద్దని, జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రశాంతంగా వెళ్లిపోవాలని సూచించారు. మొత్తంగా, మంగళవారం అనంతలో జరగబోయే పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది.