Site icon HashtagU Telugu

Kadapa : రేపటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్​మెంట్​​ ర్యాలీ.. అభ్యర్థులూ ఇవి గుర్తుంచుకోండి

Army Recruitment in Kadapa

Kadapa : ఇండియన్​ ఆర్మీలో చేరాలని భావించే యువతకు మంచి అవకాశం. రేపు (నవంబరు 10న) ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉన్న డీఎస్‌ఏ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీ నవంబరు 15 వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నెల్లూరు సహా మొత్తం 13 జిల్లాల అభ్యర్థులు పాల్గొంటారు. దాదాపు 4 వేల మంది అభ్యర్థులు(Kadapa) హాజరవుతారని అంచనా. ప్రతిరోజు సగటున 800 వందల మంది అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. కాల్‌ లెటర్‌లో ఇచ్చిన తేదీలో, సూచించిన సమయానికి హాజరై రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. డీఎస్‌ఏ స్టేడియం మెయిన్‌ గేట్‌ వద్ద కుడి వైపున ట్యాంకు సమీపంలోని చిన్న మైదానం వద్ద ఉన్న ఆఫీసులో అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

Also Read :H Pylori Infection : అమ్మ చేతి గోరు ముద్ద‌‌తో హెచ్‌. పైలోరీ బ్యాక్టీరియా వ్యాప్తి.. ఏమిటిది ?

అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలివీ.. 

  • అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుతో టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఒరిజినల్‌ ​ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి.
  • స్కూల్‌ లేదా కాలేజీ నుంచి తీసుకున్న బోనఫైడ్‌/కండక్ట్ సర్టిఫికెట్‌‌ను కూడా  తేవాలి.
  • గ్రామ సర్పంచ్​ లేదా మున్సిపల్‌ అధికారి నుంచి కండక్ట్ సర్టిఫికెట్‌ తీసుకొని రావాలి.
  • నేర చరిత్ర లేదని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి నాన్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ తీసుకొని రావాలి.
  • కులం, నివాసం ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి.
  • ఆధార్ కార్డు, పాన్‌ కార్డు తేవాలి.
  • ఒకవేళ అభ్యర్థి వద్ద ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు ఉంటే వాటిని కూడా తీసుకురావాలి.
  • అన్‌ మ్యారీడ్‌ సర్టిఫికెట్‌ కూడా అవసరం.
  • 20 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు (5×4) ఇవ్వాలి. టోపీ, కళ్లజోడు ఉన్న ఫొటోలు అనుమతించరు.
  • ఆర్మీ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో సూచించినట్లు అఫిడవిట్‌‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

Also Read :Car Burial Ceremony : లక్కీ కారుకు అంత్యక్రియలు.. ఖర్చు రూ.4 లక్షలు.. అంతిమయాత్రలో 1500 మంది