Site icon HashtagU Telugu

Loksatta Threats to TDP Party: చంద్రబాబుకు ‘సత్తా’ కు జీపీ పరీక్ష

Jp

Jp

2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఆ విషయాన్నీ పలుమార్లు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అంతే కాదు ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కూడా ప్రజారాజ్యం ప్రధాన కారణంగా చెబుతారు. ఎందుకంటే తెలంగాణాకు అనుకూలంగా లెటర్ టీడీపీ ఇవ్వడానికి కారణం అదే. ఏపీలో చిరంజీవి పార్టీ ఒక వైపు , లోక్ సత్తా మరో వైపు టీడీపీ ఓట్లను చీల్చుతాయని అప్పట్లో అంచనా. అందుకే తెలంగాణాలో బలంగా ఉన్న టీడీపీ అనుకూలంగా లెటర్ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే 2009 ఎన్నికల్లో చంద్రబాబు అనుకున్నట్టే పీఆర్పీ , లోక్ సత్తా ప్రభుత్వ వ్యతిరేక ఓటును, టీడీపీ ఓట్లను చీల్చాయని తేలింది. ఆ కారణంగా ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందని ఇప్పటికి చాలామంది టీడీపీ లీడర్ల భావిస్తుంటారు.

ఇంచుమించు 2009 లాంటి పరిస్థితే 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ఎదురయ్యేలా కనిపిస్తుంది. మళ్లీ  లోక్ సత్తా ఏపీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని సిద్ధం అవుతుంది. వికేంద్రీకరణకు మద్దతుగా మాటలాడిన జయప్రకాశ్ నారాయణ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయవాడలో సమావేశమైన జీపీ 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు . ఈ పరిణామం చంద్రబాబుకు నష్టమా ? జగన్ మోహన్ రెడ్డి కి నష్టమా ? అనే చర్చ జరుగుతుంది.

Also Read:   AP 3 Capitals in Supreme Court: మూడు ఫై 1 న “సుప్రీం” డైలమా

ఏపీలో సుపరిచితమైన జయప్రకాష్ నారయణ ఒకప్పుడూ డాక్టర్ గా, ఆ తర్వాత ఐఏఎస్‌గా, లోక్ సత్త ఉద్యమ వ్యవస్ధాపకుడిగా చివరికి లోక్ సత్తా పార్టీ అభ్యర్ధిగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులపై పూర్తి అవగాహన ఆయనకు ఉంది. అంతకు మించి ఇక్కడ రాజకీయ నాయకులతో పెనవేసుకున్న బంధం కూడా ఉండి. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం కోసం జాతీయ స్ధాయులో యూపీఏ ప్రభుత్వానికే సలహా ఇచ్చిన ఘనత ఆయనది. ఎన్నికల సంస్కరణలు అమలు చేయించేందుకు లోక్ సత్తా చేసిన ఉద్యమంలో జేపీ సాధించిన విజయాలు కూడా బాగానే ఉన్నాయి.

ఇవన్నీ ఓ ఎత్తయితే రాజకీయ నేతగా జేపీ ప్రస్ధానం మరో ఎత్తు కూకట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచినా తనకున్న పరిమితుల్లో జనాన్ని మెప్పించడంలో విఫలమైన జేపీ అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం కాస్తా ఏపీ, తెలంగాణగా విడిపోయాక సైలెంట్ గా ఉండిపోయిన జయప్రకాష్ నారాయణ్ తిరిగి ఇప్పుడు ఏపీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాజాగా విజయవాడలో ఓ మీటింగ్ పెట్టి పాత లోక్ సత్తా కార్యకర్తలు, నేతల్ని పిలిపించుకుని మాట్లాదారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో లోక్ సత్తా పోటీ చేయబోతోందని ప్రకటించిన జేపీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ పెట్టిన తరువాత తెలుగు రాష్ట్రాల రాజకీయం మారుతుంది. ఆ పార్టీతో పోతు పెట్టుకొని జీపీ రాబోవు రోజుల్లో ఏపీ లో రాజకీయాన్నీ నడిపిస్తారని తెలుస్తుంది. అంతే కాదు విజయవాడ యంపీ గా ఆయన పోటీ చేస్తారని మరో అడుగు ముందుకేసి లోక్ సత్తా వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఐతే బీ ఆర్ ఎస్ లేదంటే వైసీపీ తో పొత్తు పెట్టుకొని విజయవాడ ఎంపీగా బరిలో దిగుతారని టాక్. మొత్తం మీద 2009 మాదిరిగా మరోసారి టీడీపీకి జీపీ రూపంలో నష్టం జరగనుందని రాజకీయ వర్గాల్లోని చర్చ.

Also Read:  Rahul Gandhi : ఏపీ, తెలంగాణా పొలిటికల్ జోడో

Exit mobile version