Site icon HashtagU Telugu

YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్

Lokesh Warning

Lokesh Warning

అమరావతి(Amaravathi)పై, ముఖ్యంగా అక్కడి మహిళలపై వైసీపీ మీడియా (YCP Media) చేసిన అవమానకర వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని” అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమరావతిలో భూములు త్యాగం చేసిన మాతృమూర్తులకే ఇది రాజధాని అని, మహిళలను అవమానించే వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. అసత్య ప్రచారంతో మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

Minister Savita : వివాదంలో ఏపీ మంత్రి సవిత..ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
అమరావతిని “దేవతల రాజధాని”గా అభివర్ణిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని “దెయ్యం”గా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళల పట్ల నిరుద్యోగకంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా పాలన సాగిస్తున్నారని, విద్యార్థి దశ నుంచే మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మాభిమానం మీద దాడి చేసేవారిని ఎంతటి దుర్మార్గులైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు.

Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు

ఇక తిరుపతిలో ఓ వ్యాపారిపై వైసీపీ అనుచరులు దాడికి పాల్పడిన ఘటనపై కూడా లోకేష్ స్పందించారు. కారుపాట్స్ వ్యాపారి మోహనరావుపై భూమన అభినయ్ అనుచరులు దాడి చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ, రాష్ట్రంలో రౌడీలు, గూండాలకు స్థానం లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి, భద్రతలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు ట్వీట్ చేశారు. వైసీపీ పాలనతో సైకో మానసికత పెరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ చేష్టలకు అడ్డుకట్ట వేస్తుందని హెచ్చరించారు.